తెలంగాణ

telangana

అందాల లోగిలి.. మృత్యు కౌగిలి

By

Published : Mar 1, 2021, 3:02 PM IST

ఆదివారమని సరదాగా ఐదుగురు విద్యార్థులు కాలువ దగ్గరికి వెళ్లారు. అందరూ కలిసి సెల్ఫీ తీసుకుంటుండగా..ప్రమాదవశాత్తు ఓ విద్యార్థి కాలువలో జారిపడ్డాడు. స్నేహితుడిని కాపాడటానికి మరో విద్యార్థి నీళ్లలోకి దిగాడు. నీటి ఉద్ధృతి ఎక్కువ ఉండడం వల్ల ఆ ఇద్దరూ గల్లంతై మరణించారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఈ ఘటన జరిగింది.

ap crime news
అందాల లోగిలి.. మృత్యు కౌగిలి

విద్యార్థుల సెల్ఫీ సరదా యమపాశమై ఇద్దరి ప్రాణాలు తీసింది. ఆ రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలోని భారతి పబ్లిక్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థులు.. సెల్పీ దిగేందుకు గొల్లప్రోలు సమీపంలో ఏలేరు కాలువ వద్దకు వెళ్లారు. కాలువ వద్దనున్న వంతెనపై సెల్ఫీ తీసుకుంటుండగా వీరిలో తేజ అనే విద్యార్థి ప్రమాదవశాత్తు కాలువలో జారిపడ్డాడు. గమనించిన వాసు అనే మరో విద్యార్థి అతడిని రక్షించేందుకు కాలువలోకి దిగాడు. నీరు ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల ఇద్దరూ గల్లంతయ్యారు.

ఒడ్డునున్న మిగతా ముగ్గురు.. స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు నాలుగు గంటలకు పైగా ముమ్మరంగా గాలించి.. రాత్రి 9 గంటల సమయంలో మృతదేహాలు బయటకు తీశారు.

ఇవీచూడండి:ప్రియుడితో కలిసి వివాహిత అనుమానాస్పద మృతి

ABOUT THE AUTHOR

...view details