తెలంగాణ

telangana

TWO GIRLS FELL INTO A CANAL: ఆడుకునేందుకు వెళ్లి .. అనంతలోకాలకు

By

Published : Mar 14, 2022, 10:30 PM IST

TWO GIRLS FELL INTO A CANAL: ఆ నలుగురు చిన్నారులు సరదాగా ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. కాసేపు బాగానే గడిచింది. వారు అలా ఆడుతూ కాలువ దగ్గరకు చేరుకున్నారు. అక్కడ ఉన్న తాడును పట్టుకొని ఆడుకుంటున్నారు. కానీ ఇంతలోనే ఇద్దరు బాలికలు ప్రమాదవశాత్తు అందులో పడి గల్లంతయ్యారు.

Dead little girls
మృతి చెందిన చిన్నారులు

TWO GIRLS FELL INTO A CANAL: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం శివారు దుబ్బ తండాలో విషాదం చోటుచేసుకుంది. తండా సమీపంలోని ఎస్సారెస్పీ కాల్వలో పడి ఇద్దరు బాలికలు మృతి చెందారు.

అసలే జరిగిదంటే

ఎస్సారెస్పీ కాలువపై కట్టి ఉన్న తాడును పట్టుకొని నలుగురు బాలికలు ఆడుకుంటున్నారు. కానీ ప్రమాదవశాత్తు ఇద్దరు బాలికలు కాలువలో పడి పోయారు. మిగతా ఇద్దరు బాలికల అరుపులు విని తండా వాసులు కాలువలలో గాలించగా రమ్యశ్రీ(8) మృతదేహం లభించింది.

కొన ఊపిరితో ఉన్న వాసంతి(12) ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందింది. బంధుమిత్రుల రోదనలతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: Two died in Gaddenna project: భైంసాలో విషాదం.. సరదాగా వెళ్లి మృత్యుఒడికి..

ABOUT THE AUTHOR

...view details