తెలంగాణ

telangana

విషాదం: ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలుడు మృతి

By

Published : Apr 13, 2021, 2:11 PM IST

ప్రమాదవశాత్తు చెరువులో పడిన బాలుడు మృత్యు ఒడికి చేరాడు. మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్​ చర్లపల్లిలో ఈ ఘటన జరిగింది. దీంతో వారి కుటుంబలో విషాదఛాయలు అలుముకున్నాయి.

thirteen years old boy died accidentallly fell into the pond
చర్లపల్లిలో చెరువులో పడి బాలుడు మృతి

మేడ్చల్ జిల్లాలో కాప్రా పరిధిలోని చర్లపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడిన ప్రశాంత్​(13) మృతి చెందాడు. దీంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్నేహితులతో కలిసి చర్లపల్లి చెరువుకట్టపై నుంచి ఇంటికి వెళ్తుండగా కాలు జారి చెరువులో పడ్డాడు.

దీన్ని గమనించిన అతని స్నేహితులు కాపాడేందుకు యత్నించిన ప్రయోజనం లేకపోయింది. బాలునికి ఈత రాక పోవడంతో నీళ్లలో మునిగి చనిపోయాడని తోటి మిత్రులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని.. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి:లాటరీలో కారు గెలుచుకున్నారంటూ... ఐదు లక్షలు కాజేశారు

ABOUT THE AUTHOR

...view details