తెలంగాణ

telangana

Theft in Congress Meeting: చేతి గుర్తోళ్ల మీటింగ్‌లో జేబుదొంగల చేతివాటం

By

Published : Apr 29, 2022, 7:19 PM IST

Theft in Congress Meeting: రాజకీయ సమావేశాలు నిర్వహిస్తుండగా ఈ మధ్య దొంగలు రెచ్చిపోతున్నారు. ఇదే అదునుగా దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. అందరూ బిజీగా ఉన్న సమావేశంలో తమ పనిని సైలెంట్​గా చేసుకుంటూ వెళుతున్నారు. ఇలాంటి ఘటనే నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో చోటుచేసుకుంది.

Theft in Congress Meeting
Theft in Congress Meeting

Theft in Congress Meeting: ఇటీవల ప్రముఖుల కార్యక్రమాలే లక్ష్యంగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రముఖులు వచ్చినప్పుడు వారి వెంట వచ్చేవారిలో కలిసిపోయి... జేబుల్లోని నగదు, సెల్‌ఫోన్లు చోరీచేస్తున్నారు. దొరికిందే అదునుగా అందినకాడికి దోచేస్తున్నారు. ఇవాళ నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో చేతిగుర్తు పార్టీ మీటింగ్‌లో జేబుదొంగలు చేతివాటం ప్రదర్శించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ సన్నాహక సమావేశంలో నేతలను లూటీ చేశారు.

ఈ రోజు నాగార్జున సాగర్‌లోని రెడ్డి కల్యాణ మండపంలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హజరయ్యారు. ఈ క్రమంలో రేవంత్​రెడ్డికి సన్మానం చేసే కార్యక్రమంలో నేతలు బీజీ అయ్యారు. అప్పుడు కొంత తోపులాట చోటుచేసుకుంది. ఇదే సమయంలో దొంగలు తమ పనితనం ప్రదర్శించారు. సమావేశానికి వచ్చిన నాయకుల నుంచి అందినంత దోచేశారు. మొత్తంగా 3 లక్షల సొమ్ము చోరీకి గురైంది. ఈ జేబుదొంగలంతా హైదరాబాద్‌ నుంచి రెండు కార్లల్లో వచ్చినట్లు తెలుస్తోంది. వారిలో ఒక దొంగను సాగర్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి:రైతుల జీవితాలతో మోదీ, కేసీఆర్‌ ఆడుకుంటున్నారు: రేవంత్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details