ETV Bharat / bharat

పెళ్లి కోసం పిల్లను ఇవ్వమని ఇలా కూడా అడుగుతారా?

author img

By

Published : Apr 29, 2022, 4:52 PM IST

Updated : Apr 29, 2022, 7:05 PM IST

Dacoit Kalli Gurjar in Morena: పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి కోసం తెలిసిన వారి ద్వారా సంప్రదిస్తాం. వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహం నిశ్చయం చేసుకుంటాం. కానీ, ఓ వ్యక్తి పాయింట్​ బ్లాంక్​లో గన్ పెట్టి.. పిల్లను ఇస్తారా? చస్తారా? అని బెదిరించాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్​ మొరేనా జిల్లాలోని చంబల్​లో జరిగింది.

Dacoit Kalli Gurjar in Morena
కల్లి గుర్జార్​

Dacoit Kalli Gurjar in Morena: మధ్యప్రదేశ్​ చంబల్​ ప్రాంతంలో బందిపోట్లు.. కిడ్నాప్​లు, దోపిడీలు, దొంగతనాలు వంటివి చేస్తారని చాలా సార్లు వినేవుంటారు. కానీ, ఓ బందిపోటు దొంగ తన వృత్తికి సంబంధం లేని ఓ కొత్త పని చేసి వార్తల్లో నిలిచాడు. తన మనసు దోచిన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు తన బలాన్ని చూపించాడు. యువతి ఇంటికి వెళ్లి ఆమె తండ్రిని చితకబాది పెళ్లి చేసుకుంటానని వార్నింగ్​ ఇచ్చాడు. పాయింట్​ బ్లాంక్​లో గన్​ పెట్టి కూతుర్ని ఇస్తావా లేదా చస్తావా? అంటూ బెదిరించాడు.

ఇదీ జరిగింది: కల్లి గుర్జార్​ అనే బందిపోటు దొంగను పట్టుకునేందుకు పోలీసులు ఇప్పటికే వెతుకుతున్నారు. అతడిపై రూ.15వేల రివార్డ్​ సైతం ప్రకటించారు. ఈ క్రమంలోనే ఓ యువతి కల్లి గుర్జార్ మనసును దోచుకుంది. ఆమెను చూసి ప్రేమలో పడిపోయాడు. పెళ్లి చేసుకోవాలని గట్టిగా సంకల్పించుకున్నాడు. కానీ, ఆ యువతి తండ్రి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయించాడు. ఈ విషయం తెలుసుకున్న కల్లి గుర్జార్​ ఆగ్రహంతో ఊగిపోయాడు. గురువారం రాత్రి యువతి ఇంటికి తన గ్యాంగ్​తో వెళ్లాడు. ఆమె తండ్రిని చితకబాదాడు. కూతురిని తనకు ఇచ్చి పెళ్లి చేయాలని ఒత్తిడి చేశాడు. ఆ తర్వాత గ్రామస్థులను భయపెట్టేందుకు కాల్పులు సైతం జరిపాడు.

Dacoit Kalli Gurjar in Morena
కల్లి గుర్జార్​

పహాడగఢ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని స్యాహీ టేక్​ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గోపాల్​ గుర్జార్​ అనే వ్యక్తి కుమార్తెను ప్రేమించాడు కల్లి గుర్జార్​. తనను పెళ్లి చేసుకోకపోతే కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని బెదిరించాడు. కాల్పులతో భయబ్రాంతులకు గురైన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కల్లి గుర్జార్​ కోసం గాలిస్తున్నారు. 'కల్లి గుర్జార్​ సహా అతడి సహాయకులపై కేసు నమోదైంది. వారిపై ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి. వారిని పట్టుకునేందుకు అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.' అని ఏఎస్​పీ రైసింగ్​ నర్వారియా తెలిపారు.

ఇదీ చూడండి: దండలు మార్చుకున్నారు.. కాసేపట్లో మూడు ముళ్లు.. ఇంతలోనే వధువును కాల్చి చంపి..

Video Viral: వేధించిన వాడిని చితక్కొట్టిన యువతి

Last Updated : Apr 29, 2022, 7:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.