తెలంగాణ

telangana

Petrol Attack on Sister: ఆస్తి కోసం అక్కపై పెట్రోలు పోసి నిప్పంటించిన చెల్లెలు

By

Published : Feb 1, 2022, 10:04 AM IST

petrol attack on sister: ప్రస్తుత కాలంలో మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారాయి. డబ్బు ఎంతటి వారినైనా మార్చేస్తోంది. ఆస్తి కోసం.. సొంత అక్కనే హతమార్చేందుకు సిద్ధపడిందో ఓ చెల్లెలు. అక్కపై పెట్రోలు పోసి నిప్పంటించిన ఘటన మెదక్​ జిల్లాలో చోటుచేసుకుంది.

Petrol Attack on Sister
ఆస్తి కోసం అక్కపై పెట్రోలు పోసి నిప్పంటించిన చెల్లెలు

petrol attack on sister: మెదక్​ జిల్లా చేగుంట మండలం వడియారంలో దారుణం చోటుచేసుకుంది. పుట్టింటి తరఫు ఆస్తి కోసం అక్కపై చెల్లెలు పెట్రోలు పోసి నిప్పంటించింది చెల్లెలు. ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.

ఇదీ జరిగింది...

కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డికి చెందిన ధర్మగౌని రాజాగౌడ్‌కు నలుగురు కుమార్తెలు. వీరందరికీ వివాహాలు జరిగాయి. వీరిలో ఒకరైన వరలక్ష్మి వడియారం గ్రామంలో అద్దెఇంట్లో ఉంటుంది. పుట్టింటికి చెందిన అయిదెకరాల పంపకం విషయంలో అక్కాచెల్లెళ్ల మధ్య వివాదం జరుగుతోందని సమాచారం. సోమవారం వరలక్ష్మి సోదరి రాజేశ్వరి వడియారంలోని ఆమె ఇంటికి వచ్చారు. వారిద్దరి మధ్య ఆస్తి విషయమై వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన రాజేశ్వరి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను అక్క వరలక్ష్మిపై పోసి నిప్పంటించింది. మంటలతోనే ఉన్న వరలక్ష్మి వెళ్లి చెల్లెలు రాజేశ్వరిని గట్టిగా పట్టుకుంది. దీంతో ఇద్దరూ గాయపడ్డారు. ఇంట్లోనే ఉన్న వరలక్ష్మి పిల్లలు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి మంటలు ఆర్పేశారు. 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. తీవ్రంగా గాయపడిన వరలక్ష్మిని హైదరాబాద్‌ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరో ప్రైవేటు అంబులెన్స్‌లో రాజేశ్వరిని తూప్రాన్‌ ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి ఉస్మానియాకు తీసుకెళ్లారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:Hyderabad Drug Case: డ్రగ్స్ కేసులో వ్యాపారుల కస్టడీకి కోసం హైకోర్టులో పోలీసుల పిటిషన్

ABOUT THE AUTHOR

...view details