తెలంగాణ

telangana

బాలికపై తల్లి ప్రియుడి అత్యాచారం.. గర్భవతిని చేసి ఆపై..

By

Published : Mar 14, 2022, 9:45 AM IST

Step father raped daughter: మనుషుల్లో మానవత్వం నశించి మృగాలుగా మారుతున్నారు. తమ కామవాంఛలు తీర్చుకునేందుకు వావివరసలు మరిచి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వీరి పైశాచిత్వానికి అధిక సంఖ్యలో చిన్నారులు బలవుతున్నారు. కామాంధుల వాంఛకు బాలికల బంగారు భవిష్యత్తు బుగ్గిపాలవుతోంది. ఇంట్లో తన తల్లి ప్రవర్తన కారణంగా.. ఓ చిన్నారి జీవితం అంధకారమైంది. 13 ఏళ్లకే గర్భవతై.. నిత్య నరకం అనుభవిస్తోంది. మేడ్చల్​ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది.

step father raped on daughter
బాలికపై మారు తండ్రి అత్యాచారం

Man Raped His Stepdaughter : భర్తను వదిలేసి ఇద్దరు పిల్లలతో కలిసి వేరుగా నివసిస్తున్న ఓ తల్లి చేసిన తప్పు.. కూతురి జీవితాన్ని అగమ్యగోచరం చేసింది. తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తి.. తన కుమార్తె జీవితాన్ని నాశనం చేస్తాడని ఊహించలేకపోయింది. ఫలితంగా తన కూతురు పదమూడేళ్లకే గర్భం దాల్చింది.

Step father raped daughter : మహబూబ్​నగర్​కు చెందిన ఓ మహిళ భర్తను వదిలేసి కుమారుడు, కూతురుతో కలిసి మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్​స్టేషన్​ పరిధిలో నివసిస్తోంది. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి.. పదేళ్లుగా అతడితో సహజీవనం చేస్తోంది. మహిళ, ఆమె పిల్లలతో పాటే కలిసి ఉండే ఆ వ్యక్తి.. పదమూడేళ్ల ఆమె కుమార్తెపై కన్నేశాడు. ఎలాగైనా లోబరుచుకోవాలని చూశాడు. సమయం కోసం ఎదురుచూశాడు. ఈ క్రమంలో ప్రియురాలు పనికి వెళ్లిన సమయంలో.. పలుమార్లు బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. తల్లికి చెబితే చంపేస్తానని బెదిరించాడు. అతడి బెదిరింపులకు భయపడి ఆ బాలిక తల్లికి చెప్పడానికి సంకోచించింది. ఇది ఆసరాగా తీసుకున్న ఆ మృగం.. బాలికపై మూణ్నెళ్లుగా పలుమార్లు అఘాత్యం చేశాడు. ఆమె జీవితాన్ని నాశనం చేసి గర్భవతిని చేశాడు. ఈ విషయం తెలిస్తే తనకు శిక్ష తప్పదని భావించి అబార్షన్ చేయించాలని భావించాడు.

వారం క్రితం ఓ ఆర్ఎంపీ ద్వారా నిజాంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బాలికకు అబార్షన్ చేయించాడు. అబార్షన్ ఎఫెక్ట్​తో రెండు రోజులుగా బాలిక తీవ్ర అనారోగ్యం బారిన పడింది. ఆందోళన చెందిన తల్లి.. ఆమెను బొల్లారంలోని ఆర్ఎంపీ దగ్గరకు తీసుకెళ్లారు. విషయాన్ని గుర్తించిన సదరు ఆర్ఎంపీ.. దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తల్లి వద్ద వివరాలను సేకరించిన పోలీసులు పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details