తెలంగాణ

telangana

అందుకోసమే కొడంగల్ బాలుడి హత్య: ఎస్పీ కోటిరెడ్డి

By

Published : Oct 31, 2022, 9:53 PM IST

Kodangal Boy Missing Case

Kodangal Boy Missing Case Update: వికారాబాద్ జిల్లాలో బాలుడి కిడ్నాప్, ఆపై హత్యకు సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. డబ్బు కోసమే నిందితుడు అజయ్.. రజాఖాన్​ను హత్య చేసినట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. ఈ ఘటనలో అజయ్​ను అదుపులోకి తీసుకొని విచారించగా.. తానే హత్య చేశానని అంగీకరించినట్టు చెప్పారు.

Kodangal Boy Missing Case Update: వికారాబాద్ జిల్లాలో బాలుడి కిడ్నాప్, ఆపై హత్యకు సంబంధించిన కేసు వివరాలను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. డబ్బు కోసమే నిందితుడు అజయ్.. రజాఖాన్​ను హత్య చేసినట్లు చెప్పారు. శుక్రవారం గాంధీనగర్​లో సైకిల్​పై వెలుతున్న రజాఖాన్​ను.. అదే కాలనీలో నివాసం ఉంటున్న అజయ్ చాక్లెట్లు ఇప్పిస్తానని తన వెంట ఇంటికి తీసుకెళ్లాడని అన్నారు. ఆ తర్వాత నిన్ను కిడ్నాప్ చేశానని.. మీ నాన్నకు ఫోన్ చేసి డబ్బులు అడుగుతానని ఆ బాలుడిని భయపెట్టడాని తెలిపారు.

భయంతో రజాఖాన్ ​గదిలో గట్టిగా కేకలు వేశాడని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. వెంటనే అజయ్ తన గదిలో ఉన్న సుత్తెను తీసుకొని బాలుడిపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడని చెప్పారు. శనివారం రాత్రి మృతదేహాన్ని తన ఇంట్లో ఉన్న సూట్​కేసులో పెట్టి ఉంచాడని అన్నారు. మృతదేహాన్ని బయటికి తీసుకెళ్లేందుకు తన స్నేహితుడు హరిని సహాయం కోరగా అందుకు అతను నిరాకరించాడని తెలియజేశారు.

దీంతో ఆదివారం రోజు ఎవరూ లేని సమయంలో కొడంగల్ పట్టణం శివారులో ఉన్న వసతి గృహ సమీపంలోని ముళ్లపొదల్లో మృతదేహాన్ని పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడని చెప్పారు. నిందితుడు అజయ్​పై అనుమానంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. దీంతో అతడిని అదుపులోనికి తీసుకొని విచారించంగా.. తానే నేరం చేసినట్టు ఒప్పుకొన్నాడని ఎస్పీ కోటిరెడ్డి పేర్కొన్నారు. చిన్నారి మృతితో వికారాబాద్ కొడంగల్‌లో పాఠశాలలు, వ్యాపార సంస్థలు బంద్​ పాటించాయి. బాలుడి మృతికి నిరసనగా పలు సంస్థలు బంద్​ ప్రకటించాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్​ చేశారు.

అసలేం జరిగిందంటే: శుక్రవారం వికారాబాద్ కొడంగల్​లోని ఎస్సీ కాలనీలో నివాసముంటున్న అఫ్రోజ్​ఖాన్ కుమారుడు రజాఖాన్(10) సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు రెండు ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు చేపట్టారు. తమ కుమారుడిని క్షేమంగా అప్పగించిన వారికి రూ.5 లక్షల బహుమతి ఇస్తామని ప్రకటించారు. చివరకు తాము అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడిని చంపేశారని తెలుసుకుని గుండెలవిసేలా రోదించారు.
ఇవీ చదవండి:బాలుడి అదృశ్యం.. ఆచూకీ తెలిపితే అక్షరాలా రూ.5 లక్షలు

Boy Missing Case : కొడంగల్ బాలుడి కిడ్నాప్ కథ విషాదాంతం

పాదయాత్ర చేస్తున్న భక్తులపైకి దూసుకెళ్లిన కారు.. ఏడుగురు దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details