బాలుడి అదృశ్యం.. ఆచూకీ తెలిపితే అక్షరాలా రూ.5 లక్షలు

author img

By

Published : Oct 30, 2022, 9:12 PM IST

Boy Disappearance in Vikarabad

Boy Disappearance in Vikarabad: వికారాబాద్ కొడంగల్​కు చెందిన రజాఖాన్​(10) అనే బాలుడు నిన్న సైకిల్​ తొక్కుకుంటూ అదృశ్యమయ్యాడు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు తమ కుమారుడు ఏమైపోయాడో తెలియక శోక సంద్రంలో మునిగిపోయారు. తమ కుమారుడిని క్షేమంగా అప్పగించిన వారికి రూ.5 లక్షల బహుమతి ఇస్తామని ప్రకటించారు.

Boy Disappearance in Vikarabad: వికారాబాద్ కొడంగల్​లోని ఎస్సీ కాలనీలో నివాసముంటున్న అఫ్రోజ్​ఖాన్ కుమారుడు రజాఖాన్(10) నిన్న సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు రెండు ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు చేపట్టారు.

బాలుడు మహబూబ్​నగర్ రహదారివైపు నడుచుకుంటూ వెళ్లినట్లు స్థానికులు పోలీసులకు వెల్లడించారు. కుమారుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ కుమారుడిని క్షేమంగా అప్పగించిన వారికి రూ.5 లక్షల బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఈ కేసులో పోలీసులు ఇద్దరు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.