తెలంగాణ

telangana

Accident: పత్తి చేలోకి దూసుకెళ్లిన బస్సు... 40మంది ప్రయాణికులు...

By

Published : Nov 2, 2021, 4:25 PM IST

కుమురం భీం జిల్లాలో భారీ ప్రమాదం తప్పింది. ఆర్టీసీ డ్రైవర్ స్పృహ తప్పడంతో రోడ్డు పక్కనే గల పత్తి చేలోకి బస్సు​ దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో 40మంది ప్రయాణికులు బస్సు​లో ఉన్నప్పటికీ అదృష్టవశాత్తూ ఎవరికీ ఏం కాలేదు. ప్రమాద ఘటనపై ఆర్టీసీ అధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు.

RTC Bus Accident
RTC Bus Accident

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్ మండలంలో భారీ ప్రమాదం తప్పింది. ఆర్టీసీ డ్రైవర్ స్పృహ తప్పడంతో రోడ్డు పక్కనే గల పత్తి చేలోకి బస్సు దూసుకెళ్లింది. మంచిర్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు​ కాగజ్​నగర్ నుండి 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. బురదగుడాలోని వినయ్ మణికంఠ ఆసుపత్రి సమీపంలో డ్రైవర్ స్పృహ కోల్పోవడంతో అదుపుతప్పిన బస్సు సమీప పత్తి చెేలోకి దూసుకెళ్లింది.

విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి పత్తి చేలోకి సుమారు 100 మీటర్ల దూరం వరకు దూసుకెళ్లి కాలువలో కూరుకుపోయింది. డ్రైవర్ గణేశ్​తో సహా ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదని కండక్టర్ సత్యనారాయణ తెలిపారు. ప్రమాద సమయంలో బస్సువేగం తక్కువగా ఉండటంతో భారీ ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. ప్రమాద ఘటనపై ఆర్టీసీ అధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి:Cyber Crimes in Telangana : అప్పు ఇస్తామంటూ.. నిండా ముంచేస్తున్నారు

ABOUT THE AUTHOR

...view details