తెలంగాణ

telangana

పాతబస్తీలో రౌడీషీటర్​ దారుణ హత్య..!

By

Published : Mar 10, 2021, 4:29 AM IST

హైదరాబాద్​ పాతబస్తీలో దారుణం జరిగింది. రెయిన్ బజార్​ పీఎస్​ పరిధిలో రౌడీషీటర్​ మహమ్మద్​ పర్వేజ్​ హత్యకు గురయ్యాడు. దుండగులు కత్తులతో నరికి చంపినట్లు పోలీసులు గుర్తించారు.

rowdy sheeter murder occured old city in hyderabad in telangana news
పాతబస్తీలో రౌడీషీటర్​ దారుణ హత్య..!

హైదరాబాద్ పాతబస్తీ రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య జరిగింది. రౌడీ షీటర్ మహమ్మద్ పర్వేజ్ అలియాస్ ఫారు దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు కత్తితో అతి దారుణంగా నరికి చంపారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్​ టీం సాయంతో ఆధారాలు సేకరించారు. పోస్ట్​మార్టం నిమిత్తంకి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. అయితే హత్యకు గల కారణాలు వెల్లడించలేదు.

ఇదీ చూడండి: ఈనెల 15 నుంచి బడ్జెట్ సమావేశాలు

ABOUT THE AUTHOR

...view details