తెలంగాణ

telangana

నగరంలో గంజాయి విక్రయం... పోలీసుల అదుపులో నలుగురు

By

Published : Feb 20, 2021, 10:37 AM IST

డబ్బులు ఈజీగా సంపాదించాలనే లక్ష్యంతో గంజాయిని అమ్ముతున్న నలుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన జగద్గిరిగుట్ట పరిధిలో చోటు చేసుకుంది. వారి నుంచి 800 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

police-arrested-four-people-for-selling-cannabis-in-hyderabad
నగరంలో గంజాయి విక్రయం... పోలీసుల అదుపులో నలుగురు

మేడ్చల్ జిల్లా బొల్లారంకు చెందిన శ్రీకర్, అక్రమ్, ఫెరోజ్​తో పాటు మరో మైనర్ బాలుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ నుంచి గంజాయిని హైదరాబాద్​కి తీసుకొచ్చి పలువురికి విక్రయించారు.

సమాచారం అందుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు... నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 800 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని రిమాండ్​కు తరలించి... మైనర్​ను జువైనల్ హోమ్​కు తరలించారు. .

ఇదీ చూడండి:మైనర్​పై అత్యాచారం.. నిందితుడికి జీవిత ఖైదు

ABOUT THE AUTHOR

...view details