తెలంగాణ

telangana

దుకాణానికి వెళ్తూ... మృత్యు ఒడికి..

By

Published : Apr 24, 2021, 9:28 PM IST

లారీ ఢీకొని ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారంవారిగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దుకాణానికి వెళ్తూ రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగింది.

one person died in road accident
నారంవారిగూడెంలో రోడ్డు ప్రమాదం

కిరాణా దుకాణానికి వెళ్తున్న ఓ వ్యక్తిని లారీ రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టడంతో మృతి చెందాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నారంవారిగూడెంలో జరిగింది. గ్రామానికి చెందిన గుండెల రామారావు (55) సరకులు తీసుకొచ్చేందుకు కిరాణా దుకాణం వద్దకు రోడ్డు దాటుతుండగా రాజమండ్రి వెళ్తున్న లారీ అతన్ని ఢీకొట్టింది.

వెంటనే స్పందించిన గ్రామస్థులు చక్రాల కింద ఇరుక్కున్న అతన్ని బయటికి తీసి హుటాహుటిన అశ్వరావుపేట ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:అగ్నిమాపకశాఖ అప్రమత్తం... కొవిడ్ ఆస్పత్రుల్లో చర్యలు

ABOUT THE AUTHOR

...view details