తెలంగాణ

telangana

ఓఆర్‌ఆర్‌పై లారీని ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి

By

Published : Jun 1, 2022, 8:43 PM IST

ORR Accident: రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్​పేట్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా... మరో ముగ్గురికి గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రోడ్డు ప్రమాదం
రోడ్డు ప్రమాదం

ORR Accident: రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్​పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. విజయవాడ నుంచి హైదరాబాద్​కు వస్తున్న కారు ఆగి ఉన్న కంటైనర్ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రెవింగ్ సీటులో ఉన్న పవన్ కుమార్ అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు.

ఈ ప్రమాదంలో మృతుని భార్య(48), తల్లి(65), కుమారుడు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details