తెలంగాణ

telangana

బిట్టు శ్రీనుకు 14 రోజుల రిమాండ్

By

Published : Mar 9, 2021, 12:07 PM IST

Updated : Mar 9, 2021, 12:18 PM IST

న్యాయవాదుల హత్య కేసులో బిట్టు శ్రీనుకు కస్టడీ ముగిసింది. 7 రోజుల కస్టడీ ముగియడంతో మంథని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. బిట్టు శ్రీనుకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

బిట్టు శ్రీనుకు 14 రోజుల రిమాండ్
బిట్టు శ్రీనుకు 14 రోజుల రిమాండ్

న్యాయవాద దంపతుల హత్య కేసులో ఏ-4 నిందితుడు బిట్టు శ్రీనుకు మంథని కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. 7 రోజుల కస్టడీ ముగియడంతో నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.

న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధించగా.. అతన్ని వరంగల్ జైలుకు తరలించారు. న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణి హత్య కేసులో నిందితులకు బిట్టు శ్రీను మారణాయుధాలు, వాహనం సమకూర్చాడనే అభియోగాలు ఉన్నాయి. కుంట శ్రీనుతో కలిసి హత్యకు ప్రణాళిక వేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

Last Updated : Mar 9, 2021, 12:18 PM IST

ABOUT THE AUTHOR

...view details