తెలంగాణ

telangana

మంచంకోడుతో కొట్టి వ్యక్తి దారుణ హత్య.. ఎక్కడంటే..!!

By

Published : Dec 24, 2022, 2:40 PM IST

Murder case in Simhachalam: ఆంధ్రప్రదేశ్​లోని సింహాచలం పరిధిలోని లండగురువులో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లండ నాగరాజు అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు మంచంకోడుతో కొట్టి పరారుకాగా.. తీవ్ర రక్తస్రావంతో బాధితుడు పడిపోయాడు. గుర్తించిన బంధువులు వెంటనే నాగరాజును ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.

Murder case in ap
Murder case in ap

Murder case in Simhachalam: ఆంధ్రప్రదేశ్​లోని సింహాచలం అడివివరం సమీప ప్రాంతమైన శివారు లండగరువులో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లండ నాగరాజు (42) అనే వ్యక్తిని గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మంచంకోడుతో దాడి చేసి అక్కడ నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆయన్ను బంధువులు 108లో కేజీహెచ్​కు తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో నాగరాజు చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు.

ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న గోపాలపట్నం పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత రెండేళ్లుగా వారు విడిగా ఉంటున్నారని స్థానికులు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details