తెలంగాణ

telangana

chatanpally news: చటాన్​పల్లిలో విషాదం.. మట్టిపెళ్లలు పడి ఇద్దరు మృతి

By

Published : Oct 11, 2021, 7:45 PM IST

chatanpally incident

అంతర్గత మురుగు కాలువ నిర్మాణ పనుల్లో (internal sewer construction work) అపశ్రుతి నెలకొంది. యంత్రాలతో గుంతలు తీస్తుండగా.. మట్టిపెళ్లలు పడి ఇద్దరు కార్మికులు మృతిచెందారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చటాన్​పల్లిలో చోటుచేసుకొంది.

రంగారెడ్డి జిల్లా చటాన్​పల్లిలో విషాదం నెలకొంది. అంతర్గత మురుగు కాలువ నిర్మాణం జరుగుతుండగా.. మట్టిపెళ్లలు పడి ఇద్దరు మృతిచెందారు.

షాద్​నగర్​ పురపాలిక చటాన్​పల్లి రైల్వే గేటు నుంచి బెంగళూరు జాతీయ రహదారి బైపాస్​ వరకు అంతర్గత మురుగు కాలువ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పనుల్లో ఫరూక్​నగర్​ మండలం ఉప్పరిగడ్డ గ్రామ పంచాయతీకి చెందిన శ్రీను(38), కృష్ణ(38), రాజుతో పాటు మరో ఏడుగురు పనిచేస్తున్నారు. సోమవారం సాయంత్రం యంత్రాలతో గుంతలు తీస్తుండగా.. అకస్మాత్తుగా మట్టిపెళ్లలు పడి అక్కడ (two died at chatanpally) పనిచేస్తున్న శ్రీను, కృష్ణ, రాజు మట్టి కింద కూరుకుపోయారు. మట్టి పెళ్లల కింద పడిన రాజును గమనించిన తోటి కార్మికులు రక్షించి ఆస్పత్రికి తరలించారు.

మృతులు కృష్ణ, శ్రీనుకు ఒక్కో కుమార్తె ఉన్నారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని.. పలు సంఘాల నాయకులు, మృతుల బంధువులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు.

ఇదీచూడండి:minor girl rescued:'పని ఇప్పిస్తానని చెప్పి... మైనర్ బాలికతో వ్యభిచారం'

ABOUT THE AUTHOR

...view details