తెలంగాణ

telangana

మునుగోడు ఉపఎన్నిక వేళ.. మరోసారి భారీగా హవాలా నగదు పట్టివేత

By

Published : Oct 12, 2022, 9:25 AM IST

Updated : Oct 12, 2022, 9:57 AM IST

Illegal cash seizure of Rs 2 crore in Banjara Hills, Hyderabad
Illegal cash seizure of Rs 2 crore in Banjara Hills, Hyderabad

09:23 October 12

బంజారాహిల్స్‌లో రూ.2 కోట్ల అక్రమ నగదు పట్టివేత

హైదరాబాద్ నగరంలో చేతులు మారుతున్న హవాలా సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం వాహన తనిఖీలు చేపడుతుండగా బంజారాహిల్స్‌ రోడ్ నం-12లో వాహనంలో తరలిస్తున్న రూ.2కోట్ల నగదు బయటపడింది. డబ్బును తరలిస్తున్న సదరు వ్యక్తులు డబ్బుకు సంబంధించిన సరైన సమాధానం, పూర్తి వివరాలు చెప్పకపోవడంతో పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

నగరంలో 10 రోజుల వ్యవధిలో రూ.10కోట్లు హవాలా సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పట్టుబడుతున్న హవాలా సొమ్ము మునుగోడు ఉపఎన్నిక కోసమే చేతులు మారుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Last Updated : Oct 12, 2022, 9:57 AM IST

ABOUT THE AUTHOR

...view details