తెలంగాణ

telangana

రాయితీపై వ్యవసాయ పరికరాల పేరుతో రూ. 10 కోట్ల ఘరానా మోసం

By

Published : Apr 22, 2022, 4:19 AM IST

Updated : Apr 22, 2022, 6:50 AM IST

cheating farmers: రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వాలు సహా నాబార్డు, ప్రాథమిక సహకార సంఘాలు పని చేస్తున్నా... మోసగాళ్లు మాత్రం కొత్త పంథాలో వారిని ముంచేస్తున్నారు. భూమిని నమ్ముకొని బతుకుతున్న కష్ట జీవులను వంచిస్తున్నారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో రాయితీపై వ్యవసాయ పరికరాలంటూ ఓ ఘరానా మోసగాడు సుమారు 500 మందికిపైగా అన్నదాతలకు... 10 కోట్ల మేర టోకరా పెట్టాడు.

cheating farmers
cheating farmers

cheating farmers: రైతులకు వ్యవసాయ పరికరాల పేరుతో రైతులను నిలువునా మోసంచేసిన వ్యక్తులపై... నల్గొండ జిల్లా తిప్పర్తి పోలీస్‌స్టేషన్‌కి ఫిర్యాదులు వెల్లువలా వచ్చాయి. విషయం తెలుసుకున్న రైతులు.. పోలీస్ స్టేషన్‌కి వరుసకట్టారు. తమ డబ్బులు ఇప్పించి న్యాయంచేయాలని పోలీసులను ఆశ్రయించారు. తిప్పర్తికి చెందిన నూకల నాగరాజు గతంలో వాటర్‌షెడ్‌లో అసిస్టెంట్‌గా పని చేశాడు. సూర్యాపేట, నల్గొండ జిల్లాలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని వ్యవసాయ పరికరాలు రాయితీపై.. తక్కువ ధరలకే ఇప్పిస్తానంటూ కోట్లు కొల్లగొట్టాడు.

ఒకరిద్దరు రైతులకు వ్యవసాయ పనిముట్లు ఇచ్చి నమ్మకం కలిగించడంతో... సుమారు 500 మంది రైతులు రూ. 10 కోట్ల వరకు చెల్లించినట్లు తెలుస్తోంది. పైసలు ఇచ్చినందన పరికరాలు ఇవ్వాలంటూ కొద్దిరోజులుగా అన్నదాతలు తిరుగుతున్నా సరైన స్పందనలేదు. తమ డబ్బులు తిరిగి ఇచ్చేయాలంటూ రెండురోజుల కిందట తిప్పర్తి లో ఉంటున్న.. నూకల నాగరాజును నిలదీసేందుకు ఇంటికివెళ్లగా తాళం వేసి ఉండటంతో రైతులు ఆందోళన చేశారు. మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

'వివిధ మండలాల్లో రైతుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఏజెంట్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం. మరికొందరు పరారీలో ఉన్నట్టు సమాచారం. ప్రధాన సూత్రధారి తిప్పర్తికి చెందిన నూకల నాగరాజు అజ్ఞాతంలో ఉన్నారు.'-సత్యనారాయణ, తిప్పర్తి ఎస్సై

నల్గొండలోని కొన్ని ప్రైవేటు కంపెనీలతో కుమ్మక్కై... జిల్లాలోని కొందరు అధికారుల ప్రమేయంతో ఈ దందాను కొనసాగించాడు. నాగరాజు వెనుక రాజకీయ, అధికారుల అండ దండలు ఉన్నట్టు తెలుస్తోంది.

రాయితీపై వ్యవసాయ పరికరాల పేరుతో రూ. 10 కోట్ల ఘరానా మోసం

ఇదీ చదవండి:తెలియని వాట్సాప్‌ గ్రూపులో నీ నంబర్‌ చేరిందా? జర పైలం!

Last Updated : Apr 22, 2022, 6:50 AM IST

ABOUT THE AUTHOR

...view details