తెలంగాణ

telangana

పునరావాస ప్యాకేజీ అందలేదని యువకుడి బలవన్మరణం

By

Published : Dec 26, 2022, 2:26 PM IST

పునరావాస ప్యాకేజీ అందడం లేదని యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన యాదాద్రి జిల్లాలో చోటుచేసుకొంది. బస్వాపురం (నృసింహ) జలాశయానికి సంబంధించి పునరావాస ప్యాకేజీ అందడం లేదని బాలస్వామి అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

Young Man Forced Death in Yadadri District
Young Man Forced Death in Yadadri District

Young Man Forced Death in Yadadri District: యాదాద్రి జిల్లాలోని బస్వాపురం (నృసింహ) జలాశయానికి సంబంధించి పునరావాస ప్యాకేజీ అందడం లేదని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. భువనగిరి మండలం బీఎన్‌ తిమ్మాపూర్‌లో ఆదివారం రాత్రి 8గంటల సమయంలో ఇది చోటు చేసుకొంది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వల్దాస్‌ భిక్షపతి కుమారుడు బాలస్వామి (23) కారు మెకానిక్‌. ఇటీవల షెడ్‌ ప్రారంభించాడు.

పని సాగక చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నాడు. పెళ్లి సంబంధాలు వస్తున్నప్పటికీ కుదరట్లేదు. ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి రూ.7.50 లక్షలు పునరావస పరిహారం ఇవ్వాలని గత 27 రోజులుగా కట్టపై కొనసాగుతున్న దీక్షల్లో అతడు కూడా పాల్గొంటున్నాడు. ఈ కుటుంబంలోని తండ్రికి, సోదరుడికి ఈ మేరకు ప్యాకేజీ లభించినా బాలస్వామికి రాలేదు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details