తెలంగాణ

telangana

Loan apps case: లోన్​ యాప్​ల కేసులో చార్టెర్డ్​ అకౌంటెంట్​ను అరెస్ట్ చేసిన ఈడీ​

By

Published : Dec 3, 2021, 7:18 PM IST

Updated : Dec 3, 2021, 7:33 PM IST

Loan apps case: లోన్​ యాప్​ల కేసులో ఎన్​ఫోర్స్​మెంట్ దూకుడు పెంచింది. అక్రమంగా విదేశాలకు సొమ్ము మళ్లించడంలో సహకరించారన్న అభియోగంపై దిల్లీకి చెందిన చార్టెడ్ అకౌంటెంట్ శ్రీనివాస్​ను ఈడీ అరెస్టు చేసింది. గేమింగ్, డేటింగ్ యాప్​ల పేరుతో లక్షల మందిని మోసం చేసి.. బోగస్ బిల్లులతో సుమారు 11 వందల కోట్ల రూపాయలను హాంకాంగ్​కు తరలించినట్లు తేలిందని ఈడీ పేర్కొంది. అక్రమ చెలామణీ కోసం డొల్ల కంపెనీలను సృష్టించిన వారు పరారీలో ఉన్నట్లు దర్యాప్తు సంస్థ వెల్లడించింది.

chinese apps case
chinese apps case

LOan apps case: లోన్​ యాప్​ల కేసులో దిల్లీలోని హెచ్ఏఆర్ అసోసియేట్స్ ఛార్టెడ్ అకౌంటెంట్ రవికుమార్​ను ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. బోగస్ బిల్లులతో విదేశాలకు సొమ్ము తరలించడంలో రవికుమార్ కీలక పాత్ర పోషించినట్లు ఈడీ పేర్కొంది. రవికుమార్​ను రేపటి నుంచి ఈనెల 9 వరకు ఈడీ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతినిచ్చింది. గేమింగ్, డేటింగ్ యాప్​ల పేరిట భారత్​లో లక్షల మందిని మోసం చేశారన్న అభియోగంపై చైనీయులకు చెందిన లింక్యూన్ టెక్నాలజీ, డాకీపే టెక్నాలజీ సంస్థలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.

ed arrested chartered accountant : వెంట్రుకల వ్యాపారులకు హవాలా చెల్లింపులు, క్రిప్టో కరెన్సీ కొనుగోలు, తదితర రూపాల్లో వేల కోట్ల రూపాయలు అక్రమంగా దేశం మళ్లించారన్న మనీలాండరింగ్ అభియోగాలపై ఈడీ విచారణ జరుపుతోంది. బోగస్ విమాన బిల్లులు, నకిలీ క్లౌడ్ అద్దె బిల్లులు తయారు చేసి పలు బ్యాంకుల ద్వారా విదేశాలకు మళ్లించినట్లు దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఈడీ గుర్తించింది. దర్యాప్తు అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ సీసీఎస్ కేసు నమోదు చేసింది. సీసీఎస్ ఎఫ్ఐఆర్ ఆధారంగా బోగస్ బిల్లుల ద్వారా విదేశాలకు మళ్లింపుపై ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ మరో కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. బోగస్ బిల్లుల ద్వారా సొమ్ము మళ్లింపులో చార్టెడ్ అకౌంటెంట్ రవికుమార్ కీలక పాత్ర పోషించినట్లు ఈడీ గుర్తించింది.

loan apps case: డొల్ల కంపెనీల పేరిట 621 బోగస్ బిల్లులు, బ్యాలెన్స్ షీట్లపై సంతకాలు చేసినట్లు ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. ఒక్కో బోగస్ సర్టిఫికెట్​కు 1,500 రూపాయలు తీసుకున్నట్లు ఈడీ పేర్కొంది. హాంకాంగ్​కు సుమారు 1100 కోట్లు అక్రమంగా తరలించినట్లు ఈడీ వెల్లడించింది. ముంబైలోని ఎస్బీఐ, ఎస్బీఎం ద్వారా నిధులు చైనాకు వెళ్లినట్లు ఈడీ పేర్కొంది. డొల్ల కంపెనీల నిర్వాహకులు పరారీలో ఉన్నట్లు తెలిపింది. రేపటి నుంచి రవికమార్​ను ప్రశ్నించేందుకు ఈడీ బృందాలు సిద్ధమయ్యాయి.

ఇదీ చూడండి:రుణ యాప్​లలో సగానికి పైగా నకిలీవే: ఆర్​బీఐ

Loan app case: తెరవెనుక ఎవరున్నారనే కోణంలో దర్యాప్తు

Last Updated :Dec 3, 2021, 7:33 PM IST

ABOUT THE AUTHOR

...view details