తెలంగాణ

telangana

పానీపూరి బండి వద్ద వివాదం.. ఎంతకి దారి తీసిందంటే?

By

Published : Jun 3, 2022, 8:48 AM IST

గుడిసె వాసులు, స్థానికులకు మధ్య చెలరేగిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారి స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘర్షణలో ఇరువర్గాల వారు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వరంగల్​ జిల్లా జక్కులొద్దులో ఈ వివాదం జరిగింది.

CONFLICT BETWEEN THE TWO FACTIONS
CONFLICT BETWEEN THE TWO FACTIONS

వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం జక్కులొద్దులో అర్ధరాత్రి ఆందోళన చెలరేగింది. గుడిసె వాసులు, స్థానికులకు మధ్య తలెత్తిన గొడవ విధ్వంసానికి దారి తీసింది. ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ గ్రామంలోని ప్రభుత్వ భూమిలో సుమారు మూడు వందల మంది నిరుపేదలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. నిన్న రాత్రి అక్కడే ఓ పానీపూరి బండి వద్ద గుడిసె వాసులు, స్థానికులకు మధ్య చిన్న గొడవ తలెత్తింది. అదే ఈ విధ్వంసానికి దారి తీసింది.

ఈ దాడిలో నాలుగు ఆటోలు, మూడు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆందోళన కారులను అదుపులోకి తీసుకొని తరలించడంతో వివాదం సద్దుమనిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గొడవకు దారి తీసిన అంశాలను సేకరిస్తున్నట్లు వెల్లడించారు.

ఇవీ చదవండి:ఫేక్​ ఐడీగాళ్ల ఆగడాల 'సాక్షి'గా.. పదోతరగతి విద్యార్థిని బలి..

ABOUT THE AUTHOR

...view details