తెలంగాణ

telangana

విద్యార్థిని ఆత్మహత్య కేసు.. రికవరీ ఏజెంట్లపై కేసు నమోదు

By

Published : Jul 29, 2022, 5:23 PM IST

SUICIDE UPDATE: ఏపీలో రికవరీ ఏజెంట్ల వేధింపుల కారణంగా నందిగామలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని జాస్తి హరిత వర్షిణి కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. రికవరీ ఏజెంట్లపై ఐపీసీ 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు విజయవాడ రూరల్ డీసీపీ మేరీ ప్రశాంతి తెలిపారు.

డీసీపీ మేరీ ప్రశాంతి
డీసీపీ మేరీ ప్రశాంతి

SUICIDE UPDATE: ఆంధ్రప్రదేశ్​లో నందిగామలో విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. రికవరీ ఏజెంట్లపై ఐపీసీ 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు విజయవాడ రూరల్ డీసీపీ మేరీ ప్రశాంతి తెలిపారు. లోన్ రికవరీ చేయాలంటే నిబంధనల ప్రకారం ఏజెన్సీలు నడచుకోవాలి కానీ.. ఇంటికి వెళ్లి బాధితులను వేధింపులకు గురి చేయటం సరికాదన్నారు. నిందితులను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. విజయవాడలోని మొగల్రాజపురంలో ఏజెన్సీ కార్యాలయం ఉందని పోలీసులు నిర్ధారించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు.

ఇదీ జరిగింది: జాస్తి హరిత వర్షిణి ఈఏపీసెట్‌లో 15 వేల ర్యాంకు సాధించింది. బాలిక తండ్రి ప్రభాకర్‌రావు దిల్లీలో ప్రైవేటు కంపెనీలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. కుమార్తె చదువు కోసం తండ్రి ప్రభాకర్‌రావు... రెండేళ్ల క్రితం కరోనా సమయంలో విజయవాడలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా క్రెడిట్‌ కార్డుపై మూడున్నర లక్షల రుణం తీసుకున్నాడు. ఇటీవల బ్యాంకు అధికారులు ఇంటివద్దకు అప్పు చెల్లించాల్సిందిగా ఒత్తిడి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రిని అరెస్ట్ చేస్తారన్న ఆందోళనతో వర్షిణి బలవన్మరణానికి పాల్పడినట్లు చెప్పారు. మృతురాలి వద్ద లభించిన సూసైడ్‌ లేఖ ఆధారంగా, బాలిక తల్లి అరుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నందిగామ సీఐ కనకారావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details