'కట్నం కోసం భార్యపై గ్యాంగ్ రేప్.. లిఫ్ట్​లో ఉండగానే ముమ్మారు తలాక్!'

author img

By

Published : Jul 29, 2022, 2:29 PM IST

gang rape

అదనపు కట్నం తీసుకురాలేదని బంధువులతో కలిసి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ భర్త. ఆ దారుణం ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. మరోవైపు, అదనపు కట్నం కోసం లిఫ్ట్​లోనే భార్యకు త్రిపుల్ తలాక్ చెప్పేశాడు ఓ భర్త. ఈ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది.

ఉత్తర్​ప్రదేశ్​ గోండా జిల్లాలో దారుణం జరిగింది. అదనపు కట్నం తీసుకురాలేదని భార్యపై బంధువులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ భర్త. ఆ తర్వాత బాధితురాలికి 'త్రిపుల్ తలాక్​' చెప్పి విడాకులు తీసుకున్నాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: నిందితుడు మహమ్మద్ అద్నాన్.. లఖ్​నవూకు చెందినవాడు. అతడికి కొన్నేళ్ల క్రితం బాధితురాలితో వివాహమైంది. అదనపు కట్నం కోసం తరచుగా ఆమెను వేధించేవాడు. తీవ్రంగా కొట్టేవాడు. కొన్ని రోజుల నుంచి అద్నాన్ పెడుతున్న హింసలు తట్టుకోలేక.. బాధితురాలు తన పుట్టింట్లో ఉంటోంది. అద్నాన్, అతని బంధువులు మంగళవారం.. బాధితురాలి కన్నవారింటికి వెళ్లారు. ఒంటరిగా ఉన్న మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. కేంద్ర ప్రభుత్వం నిషేధించినా.. ముమ్మారు తలాక్ చెప్పి విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించాడు. నిందితుడు అద్నాన్​ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పరారీలో ఉన్న అతడి​ బంధువుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

అదనపు కట్నం కోసం
అపార్ట్​మెంట్ లిఫ్ట్​లో భార్యకు త్రిపుల్ తలాక్ చెప్పాడు ఓ భర్త. అదనపు వరకట్నం తీసుకురాలేదని ఇలా చేశాడు. త్రిపుల్​ తలాక్ చెప్పిన అనంతరం భార్యను ఇంట్లో నుంచి గెంటేశాడు. ఈ ఘటన కర్ణాటక బెంగళూరులోని సుద్దుగుంటెపాళ్య పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

అసలేం జరిగిందంటే: బాధితురాలికి మహమ్మద్ అక్రమ్ అనే వ్యక్తి​తో కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. అతడికి రూ.30 లక్షల కట్నం ఇచ్చారు. అయినా అది చాలదన్నట్లు అదనపు కట్నం అక్రమ్ తన భార్యను నిత్యం వేధించేవాడు. రంజాన్ పండగ సందర్భంగా రూ.10 లక్షలు తీసుకురమ్మని బాధితురాల్ని డిమాండ్ చేశాడు. పుట్టింటికి వెళ్లిన ఆమెను కొన్ని రోజుల తర్వాత ఇంటికి పిలిచాడు. బాధితురాలు డబ్బులు తీసుకురాకపోవడం వల్ల లిఫ్ట్​లోనే ట్రిపుల్ తలాక్ చెప్పేశాడు.

ఇదీ చదవండి: కిడ్నాప్ చేసి మైనర్​పై గ్యాంగ్ రేప్.. రాత్రంతా నరకం!

ఆ సిటీలో ఒకే రోజు ఐదుగురు సూసైడ్.. అసలేం జరిగింది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.