తెలంగాణ

telangana

టేకులపల్లి పీఎస్​ ఎదుట ఆందోళన.. ఏమైందంటే?

By

Published : Sep 12, 2021, 10:33 PM IST

Updated : Sep 12, 2021, 10:41 PM IST

టేకులపల్లి పీఎస్​ ఎదుట ఆందోళన.. ఏమైందంటే?

అక్రమ కేసు పెట్టి సర్పంచ్ భర్తను ఉదయం నుంచి పోలీస్ స్టేషన్​లో కూర్చోబెట్టారని టేకులపల్లి పీఎస్​ ఎదుట గ్రామస్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో స్టేషన్​ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి పోలీస్​స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. గోల్యాతండా సర్పంచ్ భర్త బోడా మంగీలాల్​పై అక్రమ కేసు పెట్టి.. ఉదయం నుంచి స్టేషన్​లో కూర్చోబెట్టారని గ్రామస్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగారు. సీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ ఇల్లందు-కొత్తగూడెం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. విషయం తెలుసుకున్న సీఐ ఘటనా స్థలానికి చేరుకున్నారు.

పోలీస్​ స్టేషన్​ ఎదుట ఆందోళన

కేసు పేరుతో ఉదయం నుంచి తన భర్తను స్టేషన్​లో ఎలా కూర్చోబెడతారని సర్పంచ్​ నిరోష సీఐ రాజును నిలదీశారు. అర్ధగంటలో సీఐ వస్తారని.. అప్పటి వరకూ ఇక్కడే కూర్చోవాలని ఎస్సై తన భర్తను స్టేషన్​లోనే కూర్చోబెట్టారని ఆరోపించారు. ఈ క్రమంలో సర్పంచ్​, సీఐ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. చివరకు సర్పంచ్​ వర్గీయులు ఆందోళన విరమించారు.

టేకులపల్లి పీఎస్​ ఎదుట ఆందోళన.. ఏమైందంటే?

హరితహారం మొక్కలు ధ్వంసం చేశారని ప్రశ్నించినందుకు తనపై అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని సర్పంచ్​ భర్త మంగీలాల్​ ఆరోపించారు. ఒక గుత్తేదారు తనపై ఫిర్యాదు ఇచ్చారని చెబుతున్నారని.. అతను కేసును విరమించుకుంటానని చెప్పినా వినకుండా తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం కావాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి: Dowry Death: భర్తతో సహా వరకట్న వేధింపులు.. వివాహిత బలవన్మరణం..!

Last Updated :Sep 12, 2021, 10:41 PM IST

ABOUT THE AUTHOR

...view details