తెలంగాణ

telangana

'ఆత్మహత్మకు ప్రయత్నించాడు.... రెండు కాళ్లు పొగొట్టుకున్నాడు'

By

Published : Jan 2, 2023, 5:38 PM IST

Updated : Jan 2, 2023, 6:03 PM IST

A young man attempted suicide in Mancherial district: ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాలకు కొన్నిసార్లు భారీ మూల్యం చెల్లించక తప్పదు. అలాంటి వారు ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లాకు చెందిన ఒక యవకుడు ఆత్మహత్య చేసుకుందాం అని రైలు పట్టాలు మీదకి వెళ్లాడు. అయితే చివరికి ఏమి జరిగింది? ప్రాణాలతో ఉన్నాడా? ఆ యువకుడికి ఎలాంటి ప్రమాదం జరిగింది?

A young man attempted suicide in Mancharyala district
ఆత్మహత్మకు ప్రయత్నించిన యువకుడు

A young man attempted suicide in Mancharyala district: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాల్​టెక్స్ దగ్గర ఓ యువకుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. రైలు పట్టాలపై కూర్చొని బెల్లంపల్లి మండలం మాల గురజాల గ్రామానికి చెందిన గోమాస క్రాంతికుమార్ ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. అతను వెనుకకు పడిపోవడంతో రైలు రెండు కాళ్ల మీద నుంచి వెళ్లిపోయింది. దిల్లీ వైపు వెళుతున్న తెలంగాణ ఎక్స్​ప్రెస్​ వెళ్లే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాసేపు రైలును ఆపివేశారు.

విషయాన్ని ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అతన్ని 108 అంబులెన్స్​లో బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 2, 2023, 6:03 PM IST

ABOUT THE AUTHOR

...view details