తెలంగాణ

telangana

సూర్యాపేట జిల్లాలో ప్రియుడితో కలిసి వివాహిత ఆత్మహత్య..

By

Published : Dec 18, 2022, 9:42 PM IST

Lady Died with Her Boy Friend In Nalgonda District: ఈ రోజుల్లో వివాహ బంధానికి అసలు విలువలేకుండా పోయింది. తమకు పెళ్లైందని కూడా మర్చిపోయి కొందరు మహిళలు వివాహేతర సంబంధాలు పెట్టుకొని తననే నమ్ముకున్న కుటుంబానికి విషాదం మిగిల్చిపోతున్నారు. ఇలాంటి ఘటనే సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. భర్త, ముగ్గురు పిల్లలున్న ఒక మహిళ వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని అతనితో కలిసి జీవించే అవకాశం లేకపోవడంతో.. ప్రియుడితో సహా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

Lady Died with Her Boy Friend In Nalgonda District
ప్రియుడితో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్య

Lady Died with Her Boy Friend In Nalgonda District: వివాహేతర సంబంధంతో ఒక్కటి కాలేమని భావించిన ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్య పాల్పడిన ఘటన తుమ్మల పెన్​పహాడ్​లో వెలుగుచూసింది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వివాహేతర సంబంధం వారిద్దరి ప్రాణాలు తీసిందని పేర్కొన్నారు. లావణ్య(35) అనే వివాహిత అదే గ్రామానికి చెందిన మహేష్(25)లు వివాహేతర సంబంధం ఏర్పడింది. లావణ్యకు ఇదివరకే పెళ్లైంది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.

కౌలు రైతుగా వ్యవసాయం చేస్తున్న మహేష్​తో లావణ్యకు పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. వివాహితగా ఉండి ముగ్గురు పిల్లలకు తల్లిగా ఉన్న లావణ్య, మహేష్​లు కలిసి జీవించే అవకాశం లేకపోవడంతో మనో వేదనకు గురైన ఇద్దరు ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. శనివారం అర్థరాత్రి ఇంటి నుంచి బయట వచ్చి వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఇంట్లో కనిపించకపోవడంతో అనుమానించిన లావణ్య భర్త పోలీసులను ఆశ్రయించాడు. మహేష్​పై అనుమానం వ్యక్తం చేశాడు. అనుమానితుడి ఫోన్ నంబర్ సేకరించి పరిశోధించిన పోలీసులు ఫోన్ సిగ్నల్ ద్వారా వాళ్లున్న ప్రాంతాన్ని గుర్తించారు. అక్కడ లావణ్య, మహేష్​ల మృత దేహాలు కనిపించడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. మృత దేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు శవ పరీక్ష నిమిత్తం సూర్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details