తెలంగాణ

telangana

ఫేస్​బుక్ ద్వారా పెళ్లి వల విసిరి.. రూ.46 లక్షలు కాజేసి..

By

Published : Dec 22, 2022, 7:46 PM IST

నేటి కాలంలో సైబర్​ నేరాలకు అంతులేకుండా పోతోంది. ప్రతిరోజు ఏదో ఒక మూల ఆన్​లైన్​ మోసాలు జరుగుతున్నాయనే వార్తలు వింటూనే ఉన్నాం. యువతులు యువకులకు వలపు వల విసిరి.. వారి వద్ద నుంచి అధిక మొత్తంలో డబ్బులు గుంజుకునే సంఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా హైదరాబాద్​లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. పెళ్లి పేరిట ఫేస్​బుక్​లో వల విసిరి.. రూ.46 లక్షలు మాయం చేసింది ఓ కి'లేడి'.

facebook crime
ఫేస్​బుక్​ మోసం

ఓ మహిళ ఫేస్‌బుక్‌లో పెళ్లి వల విసిరి రూ.46 లక్షలు కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన హైదరాబాద్​ నగరంలో జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తికి ఫేస్‌బుక్‌లో అపర్ణ అలియాస్‌ శ్వేత పరిచయమైంది. తనకు భారీగా ఆస్తులు ఉన్నాయని.. రూ.7 కోట్ల ఇన్సూరెన్స్‌ ఉందని తెలిపింది. కానీ న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని.. వాటిని పరిష్కరించుకునేందుకు డబ్బులు కావాలని నమ్మించింది. అంతా నిజమేనని నమ్మిన బాధితుడు రెండేళ్లలో విడతల వారీగా రూ.46 లక్షలు పంపించాడు.

అనంతరం ఆమె నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మహిళను అరెస్టు చేశారు. నిందితురాలి నుంచి 5 సెల్​ఫోన్​లు, ఒక ట్యాబ్‌ స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు శ్వేత సులభంగా డబ్బు సంపాదించడానికి ఫేస్‌బుక్‌లో రిక్వెస్టులు పెట్టి యువకులకు వల విసురుతున్నట్టు పోలీసులు గుర్తించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details