తెలంగాణ

telangana

'నేను ఉరేసుకుని చనిపోతున్నా'.. అంటూ భర్తకు ఫొటో పంపి ఆత్మహత్య

By

Published : Jan 31, 2023, 10:24 AM IST

A woman committed suicide in Hyderabad: భార్యాభర్తల మధ్య చిన్నచిన్న గొడవలే పెద్ద సమస్యలకు దారితీస్తాయి. ఒక్కోసారి విడిపోయేంత దూరం చేస్తే కొన్నిసార్లు ప్రాణాలు తీసుకునేలా లేదా ఎదుటివాళ్ల ప్రాణం తీసేలా ఉరిగొల్పుతాయి. అలా ఓ విషయంలో భర్త మందలించాడని క్షణకావేశంలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయే ముందు తాను బలవన్మరణం చేసుకుంటున్నానని చెబుతూ అతడికి ఫొటో కూడా పంపింది.

The woman committed suicide
మహిళ ఆత్మహత్య చేసుకుంది

A woman committed suicide in Hyderabad: చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు భర్తకు ఫొటో పంపిన భార్య బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఇది. జూబ్లీహిల్స్‌ పోలీసుల వివరాల ప్రకారం.. నేపాల్‌కు చెందిన రాజన్‌ పరియార్‌ అలియాస్‌ రాజేష్‌ ఏడాదిన్నర క్రితం అదే ప్రాంతానికి చెందిన పూజ పరియార్‌(19)ను వివాహం చేసుకున్నాడు. పెళ్లైన రెండు నెలల తరువాత ఇద్దరూ హైదరాబాద్​కి వచ్చారు. జూబ్లీహిల్స్‌లోని ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో నివసించే శైలుబాబు అనే వ్యాపారి వద్ద పనికి చేరి అక్కడే క్వార్టర్స్‌లో నివసిస్తున్నారు. పూజ రీల్స్ చేస్తుండడంపై భర్త మందలించేవాడు. భర్త మరొకరితో ఫోన్‌లో మాట్లాడుతున్నాడని పూజ సైతం గొడవ పడేది.

పూజ పరియార్‌

ఆదివారం సాయంత్రం బాత్‌రూంలో చున్నీతో ఉరి వేసుకున్నట్లు ఒక ఫొటో రాజేష్‌కు పంపింది. బయట పనిలో ఉన్న భర్త 6.30 గంటల ప్రాంతంలో ఫొటో చూసి ఇంటికొచ్చి తలుపు తట్టగా ఎంతకూ తీయలేదు. గట్టిగా నెట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా.. ఫ్యానుకు చున్నీతో ఉరేసుకొని అచేతనంగా కనిపించింది. 108 సిబ్బంది వచ్చి ఆమె మృతిచెందినట్లు నిర్ధారించారు. పోలీసులు రాజేష్‌ను అదుపులోకి తీసుకొని ఇద్దరి చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఫొటోలో ఉన్న చున్నీ, గదిలో ఉరేసుకున్న చున్నీ వేర్వేరని పోలీసులు గుర్తించారు. ప్రాథమికంగా అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details