తెలంగాణ

telangana

VIRAL VIDEO: 'నా చావుకు వాళ్లే కారణం.. దయచేసి అప్పులు చేయకండి'

By

Published : Sep 3, 2021, 11:03 AM IST

selfi video suicide

'నా చావుకు బాకీల వాళ్లే కారణం. నా పిల్లలు బంగారం. అప్పులు తీర్చలేక చనిపోతున్నా. మీరెవరూ అప్పులు చేయకండి.' అంటూ ఓ చిరు వ్యాపారి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబసభ్యులను బాధపెడుతున్నానంటూ రోదించారు. వేరే ఊరికి వెళ్లి వస్తానని ఇంట్లో వాళ్లకి చెప్పి విగతజీవిగా మారారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

వడ్డీ వ్యాపారుల వేధింపులు, బ్యాంకు రుణాలు చిరు వ్యాపారులను ఆందోళనలకు గురిచేస్తున్నాయి. పెట్టిన పెట్టుబడి రాక, చేసిన అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆదిలాబాద్​ జిల్లాలో ఓ చిరు వ్యాపారి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకోవడం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ఆదిలాబాద్​ పట్టణం భుక్తాపూర్​ కాలనీకి చెందిన జక్కుల శ్రీనివాస్​.. చిన్న వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు. కరోనా కారణంగా వ్యాపారంలో నష్టం రావడంతో చేసిన అప్పులు తీర్చలేక పోయారు. దీంతో వడ్డీ వ్యాపారుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. జిల్లా కేంద్రానికి 20కి.మీ దూరంలోని గుడిహట్నూర్​​ శివారులోని పంట చేలో సెల్ఫీ వీడియో తీసుకుని తన గోడు వెళ్లబోసుకున్నారు. ఆ తర్వాత పురుగుల మందు తాగి తనువు చాలించారు. తన చావుకు అప్పులే కారణమంటూ శ్రీనివాస్​ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. తన పిల్లలు బంగారమని.. అప్పులు తీర్చలేకే చనిపోతున్నానని రోధించారు.

సూసైడ్​కు ముందు శ్రీనివాస్​ సెల్ఫీ వీడియో

నా చావుకు బాకీల వాళ్లే కారణం. ఇంట్లో మనశ్శాంతి ఉండట్లేదు. నాకు ఇద్దరు బంగారం లాంటి పిల్లలున్నారు. దయచేసి ఎవరూ అప్పులు చేయకండి. నెల తిరక్కముందే వడ్డీల మీద వడ్డీలు వేస్తూ దోచుకుంటున్నారు. ఆ అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నా. -జక్కుల శ్రీనివాస్

తన బంధువులకు ఈ వీడియో పంపడంతో.. సంబంధీకులు ఘటనాస్థలానికి వెళ్లారు. అప్పటికే శ్రీనివాస్​ మృతి చెందారు. అతని మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు బోరున విలపించారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:attendance in schools: సర్కారు బడుల్లో పెరిగిన హాజరు.. రెండో రోజు 39 శాతం

ABOUT THE AUTHOR

...view details