తెలంగాణ

telangana

శ్రీశైలం జలాశయం వద్ద టీఎస్‌ ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

By

Published : Jan 29, 2023, 4:30 PM IST

Updated : Jan 29, 2023, 5:13 PM IST

RTC bus accident at Srisailam reservoir
RTC bus accident at Srisailam reservoir

16:25 January 29

శ్రీశైలం జలాశయం వద్ద టీఎస్‌ ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

శ్రీశైలం జలాశయం వద్ద టీఎస్‌ ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

RTC bus accident at Srisailam reservoir: శ్రీశైలం జలాశయం వద్ద టీఎస్‌ ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం నుంచి మహబూబ్‌నగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు జలాశయం మలుపు వద్ద అదుపుతప్పి రక్షణ గోడను ఢీ కొట్టింది. ప్రహరీ గోడ ఇనుప బారికేడ్‌ వల్ల బస్సు నిలిచిపోయింది. దీంతో పెను ప్రమాదమే తప్పిందనుకోవచ్చు. అప్రమత్తమైన ప్రయాణికులు బస్సులోంచి దిగిపోయారు.

ప్రస్తుత సమాచారం ప్రకారం ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది. ప్రస్తుత సమాచారం ప్రకారం బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కారణం ఏంటి ?.. డ్రైవర్​ నిర్లక్ష్యమా.. ఇంకా ఏమైన కారణాలు ఉన్నాయా.. అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ఇవీ చదవండి:

Last Updated : Jan 29, 2023, 5:13 PM IST

ABOUT THE AUTHOR

...view details