తెలంగాణ

telangana

Hyderabad Gang Rape: మైనర్​ గ్యాంగ్​రేప్​ కేసులో నిందితులు అరెస్ట్​.. అసలు ట్విస్ట్​ ఏంటంటే?

By

Published : Dec 8, 2021, 3:43 PM IST

Updated : Dec 8, 2021, 4:16 PM IST

Hyderabad Gang Rape: అప్పటికే కాస్త డిప్రెషన్​లో ఉన్న అమ్మాయి.. కాలేజీకి వెళ్తేనన్న సెట్​ అవుతాననుకుంది. తనకు తెలిసిన ఆటోడ్రైవర్​తో కలిసి కళాశాల వరకు వెళ్లింది. కానీ.. ఆ డ్రైవర్​ చెప్పిన మాయమాటలు విని అతడితో పాటు మేడిపల్లికి వెళ్లింది. నమ్మి వెళ్లినందుకు మిగతా ఆటోడ్రైవర్లతో కలిసి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నాలుగు రోజులు వేరువేరు ప్రాంతాల్లో గ్యాంగ్​రేప్​ చేసి.. చివరికి చాదర్​ఘాట్​లో పడేసి వెళ్లారు. ఆమె చెప్పిన వివరాలతో పోలీసులు.. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన ఐదుగురు నిందితులను అరెస్ట్​ చేశారు.

5 auto drivers arrested in Hyderabad Gang Rape
5 auto drivers arrested in Hyderabad Gang Rape

Hyderabad Gang Rape: హైదరాబాద్​లో కలకలం రేపిన మైనర్ బాలిక సామూహిక అత్యాచారం కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు. నాలుగు రోజులపాటు.. నగరంలోని వేరువేరు ప్రదేశాల్లో బాలికపై ఆటోడ్రైవర్లే సామూహికంగా అత్యాచారం చేసినట్టు పోలీసులు గుర్తించారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఐదుగురు ఆటో డ్రైవర్లపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Sultan Bazar Gang Rape: కాచిగూడకు చెందిన మైనర్ బాలిక కోఠిలోని ఓ కళాశాలలో చదుకుంటోంది. నాలుగు రోజుల క్రితం తనకు తెలిసిన వ్యక్తి(ఆటో డ్రైవర్​) ఆటోలో కళాశాలకు వెళ్లింది. కళాశాలకు వెళ్లిన బాలికను ఆటోడ్రైవర్ మాయ మాటలు చెప్పి మేడిపల్లి తీసుకెళ్లాడు. నమ్మి వెళ్లిన బాలికపై ఆటోడ్రైవర్లు.. అఘాయిత్యానికి పాల్పడ్డారు. మేడిపల్లిలో 4 రోజులపాటు అత్యాచారం చేశారు. రోజుకో ప్రాంతానికి తీసుకెళ్లి మరీ.. కిరాతకానికి పాల్పడ్డారు. అనంతరం.. బాలికను ఆటోడ్రైవర్​ ఛాదర్​ఘాట్ ప్రాంతంలో వదిలి వెళ్లిపోయాడు.

Auto Drivers Gang Rape: అయితే.. బాలిక తప్పిపోయిన రోజే పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కళాశాలకు వెళ్లిన కూతురు.. రాత్రి అవుతున్నా ఇంటికి రాకపోయేసరికి ఆందోళనతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొన్ని రోజులుగా డిప్రెషన్​లో ఉన్న కూతురు కళాశాలకు వెళ్తున్నానని చెప్పిందని పోలీసులకు తెలపగా.. సుల్తాన్​బజార్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. అమ్మాయిని కనిపెట్టారు. విచారణ జరపగా.. మొత్తం విషయం బయటపడింది. తనపై ఆటోడ్రైవర్లు అత్యాచారం చేశారని బాలిక తెలిపినట్టు పోలీసులు వెల్లడించారు.

బాధితురాలు తెలిపిన వివరాలు సేకరించిన పోలీసులు.. అఘాయిత్యానికి పాల్పడ్డ ఐదుగురు ఆటోడ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. పోక్స్​ చట్టం కింద కేసు నమోదు చేశారు. కేసును మాత్రం పోలీసులు గోప్యంగా ఉంచారు.

"మైనర్ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశాం. అనంతరం ఆమె కోసం గాలింపు మొదలుపెట్టాం. బాలికను ట్రేస్​ అవుట్ చేసి విచారణ జరిపాం. విచారణలో.. బాలిక ఆటో డ్రైవర్​ మాటలు నమ్మి అతనితో వెళ్లినట్లు ఒప్పుకుంది. మరోవైపు డిప్రెషన్​లో ఉన్న తమ కుమార్తె ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలికపై సామూహిక అత్యాచారం రాచకొండ కమిషనరేట్​లోని ఉప్పల్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగింది." - భిక్షపతి, సుల్తాన్ బజార్ సీఐ

సంబంధిత కథనం..

Sultan Bazar Gang Rape: హైదరాబాద్​ సుల్తాన్​బజార్​ పోలీస్ స్టేషన్ పరిధిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలికపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి..

Last Updated : Dec 8, 2021, 4:16 PM IST

ABOUT THE AUTHOR

...view details