తెలంగాణ

telangana

60 వేల రూపాలయ విలువ చేసే మద్యం పట్టివేత

By

Published : May 25, 2021, 4:09 PM IST

ఖమ్మం జిల్లా తల్లాడ చెక్​పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని 60 వేల రూపాయల విలువ చేసే 474 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

 474 bottles of liquor Seized in khammam
అక్రమంగా తరలిస్తున్న 474 మద్యం సీసాలు స్వాధీనం

ఖమ్మం జిల్లా తల్లాడ పోలీస్ చెక్ పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. కూడలిలో చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా... ఖమ్మం నుంచి పెనుబల్లి మండలం కంది బంజరకు ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న 474 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం విలువ రూ. 60 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

నిందితుడిని అదుపులోకి తీసుకొని, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. ఎవరైనా చట్ట వ్యతిరేకంగా మద్యం రవాణా చేస్తే... కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై నరేష్ హెచ్చరించారు. కేసు నిమిత్తం మద్యం సీసాలను వైరా ఎక్సైజ్ శాఖకు అప్పగించారు.

ఇదీ చదవండి :ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం వాయిదా

ABOUT THE AUTHOR

...view details