తెలంగాణ

telangana

100 క్వింటాల నల్ల బెల్లం పట్టివేత

By

Published : May 9, 2021, 5:57 PM IST

మహబూబాబాద్ జిల్లా సీరోల్​​లో నిషేధిత బెల్లాన్ని అక్రమంగా తరలిస్తోన్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 100 క్వింటాల నల్ల బెల్లం, 2 క్వింటాల పటికను స్వాధీనం చేసుకున్నారు.

black jaggery seized
నల్ల బెల్లం

గుట్టుచప్పుడు కాకుండా బెల్లాన్ని అక్రమంగా తరలిస్తోన్న ఓ ముఠాను మహబూబాబాద్ జిల్లా​ సీరోల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 100 క్వింటాల నల్ల బెల్లం, 2 క్వింటాల పటికను స్వాధీనం చేసుకున్నారు. ఓ లారీని సీజ్ చేసి.. ఐదుగురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు.

ఓ ముఠాగా ఏర్పడి..

అయోధ్య గ్రామం శివారు భజనతండాకు చెందిన నరేందర్, వీరేందర్, వీరన్న, గణేశ్​లతో పాటు ఏపీకి చెందిన పుల్లారావు అనే వ్యక్తి కలిసి ఓ ముఠాగా ఏర్పడి అక్రమానికి పాల్పడినట్లు జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. బెల్లం, పటిక విలువ సుమారు రూ. 6 లక్షల 40 వేలు ఉంటుందని వెల్లడించారు. పొరుగు రాష్ట్రాల్లో తక్కువ ధరకు కొనుగోలు చేసి.. రాష్ట్రానికి తీసుకువచ్చి అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని వివరించారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడిన వారిపై పీడి యాక్ట్ కేసులు పెడతామని ఆయన హెచ్చరించారు.

ఇదీ చదవండి:అర్ధరాత్రి నగల దుకాణంలో భారీ చోరీ

ABOUT THE AUTHOR

...view details