తెలంగాణ

telangana

ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత దంపతులకు కరోనా

By

Published : Jul 4, 2020, 3:21 PM IST

Updated : Jul 4, 2020, 4:57 PM IST

ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత దంపతులకు కరోనా
ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత దంపతులకు కరోనా

15:19 July 04

ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత దంపతులకు కరోనా

నల్గొండ డీసీసీబీ ఛైర్మన్‌ గొంగిడి మహేందర్ రెడ్డికి కరోనా నిర్ధారణ అయింది. శుక్రవారం మహేందర్‌ రెడ్డి భార్య ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత కరోనా బారిన పడ్డారు. గొంగిడి సునీత ఇద్దరు డ్రైవర్లకు కూడా ఇప్పటికే కరోనా నిర్ధరణ అయింది. నాలుగు రోజుల క్రితం ఆమె స్వల్ప అస్వస్థతకు గురికాగా.. చికిత్స నిమిత్తం హైదరాబాద్​లోని యశోద ఆస్పత్రిలో చేరారు. అక్కడ కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. అదే ఆస్పత్రిలో ఆమె కూడా చికిత్స పొందుతున్నారు.

 రాష్ట్రంలో వరసగా ఎమ్మెల్యేలు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇంతకుముందే జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు గణేశ్ గుప్తాతో పాటు... హోంమంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావులు కూడా కరోనా బారిన పడ్డారు.

ఇవీ చూడండి:మిర్యాలగూడలో రామ్‌గోపాల్‌ వర్మపై కేసు నమోదు

Last Updated : Jul 4, 2020, 4:57 PM IST

ABOUT THE AUTHOR

...view details