తెలంగాణ

telangana

వైకుంఠ ఏకాదశి.. భక్తులకు శ్రీహరి అభయప్రదానం

By

Published : Dec 25, 2020, 3:51 PM IST

వైకుంఠ ఏకాదశి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువజాము నుంచే దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారం నుంచి స్వామివారు దర్శనమిస్తున్నారు.

Mukkoti Ekadashi celebrations in Mahabubnagar district
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు

ముక్కోటి ఏకాదశి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లాలో వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. జిల్లా కేంద్రంలోని కాటన్​మిల్ వద్ద ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వారం నుంచి స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు.

శ్రీ లక్ష్మీ నృరసింహ స్వామి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా పల్లకి సేవ నిర్వహించిన అంతరం.. భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించారు.

ఇదీ చూడండి: భద్రాద్రి: రాములోరి దర్శనంలో ఎమ్మెల్యే, భక్తులకు ఇబ్బందులు

ABOUT THE AUTHOR

...view details