తెలంగాణ

telangana

Bandi Sanjay: రాబోయే ఆరు నెలల్లో ఆర్డీఎస్ ద్వారా సాగునీరు: బండి సంజయ్

By

Published : Apr 22, 2022, 5:22 AM IST

Updated : Apr 22, 2022, 6:38 AM IST

Bandi Sanjay: కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇవ్వటం లేదని మంత్రి కేటీఆర్‌ చేసిన సవాల్‌పై భాజపా స్పందించింది. రాష్ట్ర వాటాకు అదనంగా కేంద్రం లక్షన్నర కోట్లు ఇచ్చిందని ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా గద్వాలలో నిర్వహించిన బహిరంగ సభలో బండి సంజయ్‌ స్పష్టంచేశారు. ఆరు నెలల్లో ఆర్డీఎస్​ ద్వారా నడిగడ్డకు నీళ్లిస్తామన్న సంజయ్‌...ఇప్పటి నుంచి డీకే అరుణను ఆర్డీఎస్‌ అరుణగా పిలవాలని నడిగడ్డ వాసులకు విజ్ఞప్తి చేశారు. 2023లో మార్పునకు తెలంగాణ ప్రజలు నాంది పలకాలని బండి పిలుపునిచ్చారు.

Bandi Sanjay
Bandi Sanjay

Bandi Sanjay: కేంద్రం రాష్ట్రానికి ఏమి ఇవ్వటం లేదని మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గద్వాలలో నిర్వహించిన ప్రజాసంగ్రామ యాత్ర బహిరంగ సభలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేంద్రం గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి లక్షా 68 వేల కోట్లు ఇచ్చిందని స్పష్టం చేశారు. మరో లక్షన్నర కోట్లు సంక్షేమ పథకాల రూపంలో వచ్చాయని వివరించారు. తెలంగాణకు నిధులిస్తున్న ప్రధాని మోదీని విమర్శిస్తారా అని ప్రశ్నించారు.

'ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్డీఎస్‌ పూర్తి చేసి నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. 8 ఏళ్లుగా నడిగడ్డ ప్రజలను మోసం చేశారు. రాబోయే ఆరు నెలల్లో ఆర్డీఎస్​ ద్వారా నీళ్లిస్తామని కేంద్రం స్పష్టం చేసినది. కేఆర్‌ఎంబీ ద్వారా ఆర్డీఎస్ హెడ్ రెగ్యులేటరీ మరమ్మతు. కేసీఆర్ చేయలేని పని కేంద్రం చేస్తోంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. ఆర్డీఎస్‌ అంశంలో తెలంగాణపై అన్యాయాన్ని పరిష్కరించమన్నాం. తెలంగాణకు నిధులిస్తున్న ప్రధాని మోదీని విమర్శిస్తారా? గద్వాల బహిరంగ సభ ఆర్డీఎస్ విజయోత్సవ సభ.' -బండి సంజయ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

గవర్నర్​కు అవమానాలా? : సామాజిక మాధ్యమాల్లో గవర్నర్‌ను అవమానించటంపై భాజపా తమిళనాడు అధ్యక్షుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమిళిసై సౌందర్‌రాజన్‌ను అవమానిస్తే తెలంగాణలోని మహిళలను అవమానించినట్లేనని వ్యాఖ్యానించారు. 2023 లో రాష్ట్రంలోని మహిళలు అందుకు సమాధానం చెబుతారని హెచ్చరించారు.

'నేను తమిళనాడు నుంచి వచ్చాను. 35 వేల కోట్ల రాబడితో... మద్యం వినియోగంలో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. తెలంగాణలో మద్యం దుకాణాల కేటాయింపులో సామాజిక న్యాయం పాటిస్తున్నట్లు పత్రికల్లో చూసి అవాకయ్యాను. తెలంగాణ ప్రజలు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, నీటి వాటాల కేటాయింపు, అభివృద్ధి కార్యక్రమాల్లో సామాజిక న్యాయం కోరుకుంటున్నారు. అంతే కానీ మద్యం దుకాణాల కేటాయింపులో కాదు.'- అన్నామలై, భాజపా తమిళనాడు అధ్యక్షుడు

భాజపాను ఎదుర్కొనే సత్తా లేకనే తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తిట్ల పురాణం మెుదలు పెట్టాడని హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. పాతబస్తీలో వేధింపులకు గురైన వారినే భాజపా ప్రభుత్వంలో అధికారులుగా నియమిస్తామని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. రామాయంపేట, ఖమ్మం, కోదాడ అఘాయిత్యాలకు తెరాసనే కారణమని ఆరోపించారు.హత్యా రాజకీయాలు ఎన్ని రోజులు భరిస్తామన్నబండి సంజయ్‌...సాయి గణేష్ త్యాగాన్ని వృథా కానీవ్వమని... బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు.

ఆరు నెలల్లో ఆర్డీఎస్ ద్వారా సాగునీరు: బండి సంజయ్

ఇదీ చదవండి:Bandi Sanjay on TRS: 'సాయి గణేశ్ త్యాగాన్ని వృథా కానీవ్వం.. బదులు తీర్చుకుంటాం'

Last Updated :Apr 22, 2022, 6:38 AM IST

ABOUT THE AUTHOR

...view details