ETV Bharat / bharat

ఆ 10 మంది గురువుల పాదాలకు నమస్కరిస్తున్నా: మోదీ

author img

By

Published : Apr 21, 2022, 10:23 PM IST

Updated : Apr 21, 2022, 10:56 PM IST

PM Modi
ప్రధాని మోదీ

PM Modi: సిక్కుల మతగురువు గురు తేగ్​ బహదూర్​ 400వ జయంతి ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రత్యేక తపాలా బిళ్ల, స్మారక నాణెం విడుదల చేశారు మోదీ.

PM Modi: సిక్కుల మతగురువు తేగ్​ బహుదూర్​ 400వ జయంతి వేడుకల.. సందర్భంగా ఎర్రకోట వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది కేంద్రం. ప్రధాని నరేంద్ర మోదీ హాజరై తేగ్​ బహదూర్​కు నివాళులర్పించారు. ప్రత్యేక తపాలా బిళ్ల, స్మారక నాణెం విడుదల చేశారు. అనంతరం తొలిసారిగా ఎర్రకోటలో సంప్రదాయానికి భిన్నంగా సూర్యాస్తమయం తర్వాత జాతినుద్దేశించి ప్రసంగించారు మోదీ.

PM Modi:
గురు తేగ్​ బహుదూర్​ జయంతి ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ

ప్రకాశ్​ పర్వ్​ సందర్భంగా.. అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు మోదీ. సిక్కు గురువుల ఆదర్శాలను భారత్​ అనుసరిస్తోందని, అందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఈ పుణ్య తిథి పురస్కరించుకొని.. 10 మంది గురువుల పాదాలకు నమస్కరిస్తున్నా అన్నారు. మత గురువులు సామాజిక బాధ్యతలు నిర్వర్తించారని, ఇందుకోసం తమ జీవితాలను సమర్పించారని వ్యాఖ్యానించారు. భారత్​ ఎప్పుడూ ఏ దేశానికీ.. ఎలాంటి ముప్పూ కలిగించలేదని మోదీ అన్నారు. ఇప్పటికీ ప్రపంచ సంక్షేమాన్నే కోరుకుంటోందని అన్నారు.

PM Modi
గురు తేగ్​ బహదూర్​ జయంతి ఉత్సవాల్లో భాగంగా విడుదల చేసిన తపాల బిళ్ల
PM Modi
ప్రధాని మోదీ విడుదల చేసిన స్మారక నాణెం
PM Modi
స్మారక నాణెం

స్వాతంత్ర వేడుకల సమయంలో ప్రసంగించే చోటు వద్ద కాకుండా మరో ప్రాంతంలో ఈ ప్రసంగాన్ని నిర్వహించారు. తేగ్​ బహుదూర్​కు మరణశిక్షకు అప్పటి ముఘల్​ రాజు ఔరంగజేబ్​ ఈ ఎర్రకోట నుంచే ఆదేశాలు జారీ చేసిన కారణంగా.. అందుకు ప్రతీకగా ఇక్కడే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టు అధికారులు వెల్లడించారు. స్వాతంత్య్ర వేడుకల సమయంలో కాకుండా ఈ ప్రాంతంలో ప్రధాని ప్రసంగించడం ఇది రెండోసారి. అంతకుముందు.. 2018లో స్వాతంత్య్ర సమర యోధుడు నేతాజీ సుభాష్​ చంద్రబోస్​ ఆజాద్​ హింద్​ ప్రభుత్వం స్థాపించి 75 ఏళ్ల పూర్తయిన సందర్భంగా మోదీ ఎర్రకోట వద్ద ప్రసగించారు.

PM Modi:
ప్రధాని నరేంద్ర మోదీ

1000 మంది భద్రతా సిబ్బంది: ఎర్రకోట నుంచి ప్రధాని ప్రసంగం నేపథ్యంలో కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. 1000 మందికి పైగా దిల్లీ పోలీసులు, వివిధ ఏజెన్సీలకు చెందిన బలగాలతో భద్రతా వలయాలను ఏర్పాటు చేశారు. ప్రసంగ వేదికలో సహా కోట ప్రాంగణమంతా సీసీటీవీ కెమెరాలతో పహారా ఏర్పాటు చేశారు. ఎన్‌ఎస్‌జీ స్నైపర్లు, స్వాట్ కమాండోలు, కైట్ క్యాచర్లు, కానైన్ యూనిట్లు, షార్ప్ షూటర్లతో భారీ భద్రతా ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. అలాగే దిల్లీలో కరోనా కేసులు పెరుగుతోన్న తరుణంలో కొవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. 'స్వాతంత్య్ర దినోత్సవం రోజు చేసే ఏర్పాట్ల మాదిరిగానే పూర్తి భద్రతా చర్యలు తీసుకున్నాం. అలాగే జహంగీర్‌పురి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నందున మేం మరింత అప్రమత్తంగా ఉండాలి' అంటూ ఓ సీనియర్ అధికారి తెలిపారు.

ఇదీ చూడండి: గుజరాత్​లో బ్రిటన్​ ప్రధాని.. 'బుల్​డోజర్'​ ఫ్యాక్టరీలో సందడి సందడిగా..!

Last Updated :Apr 21, 2022, 10:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.