తెలంగాణ

telangana

ఆ మహిళ చెప్పిన సమాధానం ఎమ్మెల్యేను తలపట్టుకునేలా చేసింది

By

Published : Aug 30, 2022, 11:32 AM IST

MLA Saiprasad Reddy ఏపీలోని ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డికి ఓ మహిళ నుంచి ఊహించని సమాధానం ఎదురైంది. ఎన్నికల్లో ఈసారి ఎవరికి ఓటు వేస్తారన్న ఎమ్మెల్యే ప్రశ్నకు ఆ మహిళ ఇచ్చిన సమాధానం కాసేపు ఆయనను తల పట్టుకునేలా చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.

ఆ మహిళ చెప్పిన సమాధానం ఎమ్మెల్యేను తలపట్టుకునేలా చేసింది
ఆ మహిళ చెప్పిన సమాధానం ఎమ్మెల్యేను తలపట్టుకునేలా చేసింది

ఎమ్మెల్యే: అమ్మఒడి, జగనన్న చేయూత, నేతన్న నేస్తం.. ఈ పథకాలన్నీ ఎవరిస్తున్నారు?

గంగమ్మ:మీరే.

ఎమ్మెల్యే: నేను కాదమ్మా.. ప్రభుత్వం ఇస్తోంది. అందరికీ అందుతున్నాయి కదా. ఈసారి ఓటెవరికి వేస్తావు?

గంగమ్మ: చంద్రబాబు నాయుడికి.

ఎమ్మెల్యే:ఓ.. ఇంతసేపు చెప్పిందంతా ఉత్తదాయనా

ఇదీ ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా ఆదోని 17వ వార్డులో సోమవారం జరిగిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డికి, మహిళ గంగమ్మకు మధ్య జరిగిన సంభాషణ. పట్టణవాసులు ఎమ్మెల్యేకు పలు సమస్యలను విన్నవించారు. అఖరి విడత విద్యా దీవెన రాకపోవడంతో రూ.52 వేలు సొంతంగా చెల్లించి విద్యా ధ్రువీకరణ పత్రాలు తెచ్చుకున్నానని పీజీ విద్యార్థి కల్యాణ్‌.. ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. దర్జీ వృత్తే ఆధారంగా జీవిస్తున్న తనకు చేదోడుసాయం అందలేదని వితంతు మహిళ జానకి వాపోయారు. తమకు జగనన్న ఇళ్ల స్థలాలు రాలేదని గంగమ్మ, రజియా, రేష్మాబాను, హుసేనమ్మ, సుచిత్ర తదితరులు వివరించారు. గతంలో స్థలాల కోసం రూ.2,100 డీడీలు చెల్లించామని, స్థలం మాత్రం చూపలేదని పలు కుటుంబాలు మొరపెట్టుకున్నాయి.
ఇవీ చదవండి..:

ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

దేశంలో తగ్గిన కొవిడ్​ కేసులు, జపాన్​లో ఆగని ఉద్ధృతి, భారీగా మరణాలు

ABOUT THE AUTHOR

...view details