ETV Bharat / bharat

దేశంలో తగ్గిన కొవిడ్​ కేసులు, జపాన్​లో ఆగని ఉద్ధృతి, భారీగా మరణాలు

author img

By

Published : Aug 30, 2022, 10:16 AM IST

corona report
కరోనా

Corona Cases in India భారత్​లో కొత్తగా 5,439 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 22,031 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Corona Cases in India : దేశంలో సోమవారం 8 నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు 5,439 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజులో 22,031 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.62 శాతానికి పెరిగింది. యాక్టివ్​ కేసులు 0.15 శాతానికి తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 4,44,15,723
  • క్రియాశీల కేసులు: 65,732
  • కోలుకున్నవారు: 4,38,25,024

Vaccination In India : దేశంలో ఆదివారం 26,36,224 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 212.17 కోట్లకు చేరింది. ఒక్కరోజే 3,20,418 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Coronavirus Cases : ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మరింత తగ్గాయి. కొత్తగా 4,38,618 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో మరో 1,279 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 606,419,045 కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 6,489,681 మంది మరణించారు. శనివారం మరో 7,99,759 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 582,001,805 కు చేరింది.

  • జపాన్​లో కొత్తగా 1,53,225 కేసులు వెలుగుచూశాయి. మరో 235 మందికిపైగా మరణించారు.
  • దక్షిణ కొరియాలో 43,142 కొవిడ్​ కేసులు, 49 మరణాలు నమోదయ్యాయి.
  • అమెరికాలో 30,148 కొత్త కేసులు, 112 మరణాలు వెలుగుచూశాయి.
  • ఇటలీ, జర్మనీ, తైవాన్, ఫ్రాన్స్​, బ్రెజిల్​​లోనూ కేసులు భారీగా నమోదవుతున్నాయి.

ఇవీ చదవండి : ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ సేన్ మృతి

చీమల దండయాత్ర, చూపు కోల్పోతున్న పశువులు, వలస వెళ్తున్న ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.