తెలంగాణ

telangana

Vidyanjali Scheme news 2021 : మీరు చదువుకున్న బడికి సాయం చేయాలనుకుంటున్నారా..!

By

Published : Nov 23, 2021, 8:34 AM IST

Vidyanjali Scheme news 2021 : మీరు చదువుకున్న స్కూల్​కు మీ వంతు సాయం చేయాలనుకుంటున్నారు. కానీ మీరు సుదూర ప్రాంతాల్లో లేదా విదేశాల్లో ఉన్నందువల్ల సాయం చేయడం సాధ్యం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మీకు మీ పాఠశాలకు మధ్య వారధిగా నిలిచి.. మీ సాయాన్ని స్కూల్​కు చేర్చేందుకు దోహదపడుతుంది కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన విద్యాంజలి పథకం. ఈ పథకం ద్వారా కేవలం మీరే కాదు.. పరిశ్రమలు, స్వచ్ఛంద సంస్థలకు.. స్కూళ్లకు మధ్య వారధిగా నిలుస్తోంది.

Vidyanjali Scheme news 2021
Vidyanjali Scheme news 2021

vidyanjali scheme news 2021 : మీరు అక్షరాలు దిద్దిన సర్కారు బడి ప్రస్తుతం వసతుల లేమితో దీనావస్థలో ఉంది. దానికి ఏదో రూపేణా సహకారం అందిద్దామన్నా సుదూర ప్రాంతాల్లో, విదేశాల్లో ఉన్నందువల్ల సాధ్యం కావడం లేదు. మీరే కాదు.. పరిశ్రమలు, ప్రైవేట్‌, స్వచ్ఛంద సంస్థలకు.. పాఠశాలలకు మధ్య వారధిగా నిలిచేందుకు కేంద్ర విద్యాశాఖ ‘విద్యాంజలి’ పేరిట నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సమాజ భాగస్వామ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది.

విరాళాలు వీటికి ఇవ్వొచ్చు

donations for schools by Vidyanjali scheme : నిర్మాణ పనులు *విద్యుత్‌ ఉపకరణాలు *బోర్డులు, బల్లలు, కుర్చీలు, పుస్తకాలు, సైన్స్‌, గణితం కిట్లు *కంప్యూటర్‌, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌, ఇంటరాక్టివ్‌ వైట్‌బోర్డు, టీవీ, ల్యాప్‌టాప్‌ *క్రీడలు, విద్యేతర(కోకరికులర్‌) కార్యకలాపాలకు అవసరమైన వస్తు సామగ్రి *ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌, వాటర్‌ ప్యూరిఫయర్‌, థర్మామీటర్‌, చేతుల శుభ్రత(హ్యాండ్‌వాష్‌) సౌకర్యాలు, వీల్‌ఛైర్‌, హియరింగ్‌ ఎయిడ్స్‌ *టూల్‌కిట్స్‌, బోధన-అభ్యసన సామగ్రి, నిర్వహణ-మరమ్మతులు, కార్యాలయ అవసరాలు.

రాష్ట్ర సీఎస్‌ఆర్‌ పోర్టల్‌ ఇక లేనట్లే!

విద్యాశాఖ కార్యదర్శిగా జనార్దన్‌రెడ్డి ఉన్న సమయంలో కార్పొరేట్‌ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్‌) కింద నిధులు సేకరించాలని భావించి 2019 ఆగస్టులో సీఎస్‌ఆర్‌ పోర్టల్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ఆరు నెలల్లోనే ఆయన బదిలీ కావడం.. 2020 మార్చి నుంచి కరోనా ఉద్ధృతితో ఆ కార్యక్రమం దాదాపు మూలనపడింది. కేంద్ర విద్యాశాఖే పోర్టల్‌ తెచ్చినందున రాష్ట్ర పోర్టల్‌ అవసరం ఇక ఉండదని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

సేవలూ అందించొచ్చు

విశ్రాంత ఉపాధ్యాయులు తమ సబ్జెక్టులను బోధించవచ్చు. ఇతర రంగాల నిపుణులు తమ రంగాలకు సంబంధించిన అంశాలను వివరించవచ్చు.

పోర్టల్‌లో పాఠశాలల నమోదు షురూ

vidyanjali scheme purpose : అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలు తమ అవసరాలేమిటి? నిధులెన్ని కావాలి? తదితర వివరాలను పోర్టల్‌లో పొందుపరచాలి. తద్వారా వాలంటీరు(దాత)గా నమోదు చేసుకున్నవారు తగిన సహకారం అందించేందుకు అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా పాఠశాలల నమోదు ప్రక్రియ మొదలైంది. తెలంగాణలో అన్ని రకాల ప్రభుత్వ బడులు, గురుకులాలు 28,888 ఉండగా.. 10,438 పాఠశాలల నమోదు పూర్తయింది. ‘దాతలతో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎంవోయూ కుదుర్చుకొని పనులు మొదలుపెడతారు’ అని రాష్ట్ర విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details