తెలంగాణ

telangana

వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 వరకు విమోచన ఉత్సవాలు: కిషన్‌రెడ్డి

By

Published : Sep 16, 2022, 9:46 PM IST

Kishan reddy on Liberation day: విమోచన ఉత్సవాలను కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్​రెడ్డి తెలిపారు. నిజాం నిరంకుశపాలనకు వ్యతిరేకంగా పోరాడి.. బలిదానమైన అమరులను స్మరించుకునేందుకు.. 75 ఏళ్ల తర్వాత గొప్ప అవకాశం వచ్చిందని.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో రేపు అట్టహాసంగా నిర్వహించనున్న వేడుకలకు ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.

Kishan reddy
Kishan reddy

వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 వరకు విమోచన ఉత్సవాలు: కిషన్‌రెడ్డి

Kishan reddy on Liberation day: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి.. బలిదానమైన అమరులను స్మరించుకునేందుకు.. 75 ఏళ్ల తర్వాత గొప్ప అవకాశం వచ్చిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో రేపు అట్టహాసంగా నిర్వహించనున్న వేడుకలకు ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహిస్తున్న విమోచన ఉత్సవాలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హాజరై.. జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారని ఆయన వెల్లడించారు.

కేంద్ర భద్రత బలగాల పరేడ్‌, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు.. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించికుంటామని కిషన్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకకు సంబంధించిన 1300 మంది కళాకారులు బృందాలుగా ప్రదర్శన ఇస్తారని తెలిపారు. రేపు సాయంత్రం 5 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, కర్ణాటక ముఖ్యమంత్రికి స్వయంగా ఆహ్వానాలు పంపామని కిషన్‌రెడ్డి తెలిపారు.

'రేపు జరిగే ఉత్సవాలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి హాజరవుతారు. వేడుకలకు కర్ణాటక ముఖ్యమంత్రి లేదా ఆ రాష్ట్ర మంత్రులు హాజరవుతారు. కర్ణాటక, మహారాష్ట్రలో సెప్టెంబర్‌ 17న ముక్తి దివస్‌ పేరుతో వేడుకలు జరిగాయి. కర్ణాటక, మహారాష్ట్రలో గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వేడుకలు నిర్వహించింది. నిజాం ఏలిన హైదరాబాద్‌లో మాత్రం గత ప్రభుత్వాలు నిర్వహించలేదు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈసారి వేడుకలు నిర్వహిస్తున్నాం. రేపు హైదరాబాద్‌లో జరిగే వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొంటారు. పింగళి వెంకయ్య జయంతి వేడుకలు కూడా దిల్లీలో ఘనంగా నిర్వహించాం.'-కిషన్​రెడ్డి, కేంద్రమంత్రి

సమాజానికి సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలి..:మరోవైపు కేసీఆర్ రజాకార్ల వారసులే మజ్లిస్ పార్టీ నాయకులని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ఆరోపించారు. తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి కేసీఆర్ ఉత్సవాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన వేడుకలు అధికారికంగా నిర్వహిస్తుంటే.. సీఎం కేసీఆర్ సమైక్యతా వజ్రోత్సవాలు అంటున్నారని మండిపడ్డారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవానికి సంబంధించిన ఛాయా చిత్ర ప్రదర్శనను తిలకించిన లక్ష్మణ్.. సమైక్యతా ఉత్సవాలు ఎవరి కోసం.. ఎవరి సమైక్యతా కోసం కేసీఆర్ నిర్వహిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ ప్రజల మనోభావాలు గౌరవించిందని.. అందుకోసమే తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details