తెలంగాణ

telangana

ఉగాది మహోత్సవాలకు ముస్తాబైన శ్రీశైల మహాక్షేత్రం.. ఐదు రోజుల పాటు ఉత్సవాలు

By

Published : Mar 30, 2022, 9:50 AM IST

Ugadi In Srisailam: ఐదు రోజుల పాటు జరిగే ఉగాది మహోత్సవాలకు శ్రీశైల మహాక్షేత్రం ముస్తాబైంది. ఉత్సవాల కోసం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.

ఉగాది మహోత్సవాలకు ముస్తాబైన శ్రీశైల మహాక్షేత్రం.. ఐదు రోజుల పాటు ఉత్సవాలు
ఉగాది మహోత్సవాలకు ముస్తాబైన శ్రీశైల మహాక్షేత్రం.. ఐదు రోజుల పాటు ఉత్సవాలు

Ugadi In Srisailam: ఉగాది మహోత్సవాలకు శ్రీశైల మహాక్షేత్రం ముస్తాబైంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం కోసం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈవో లవన్న, ధర్మకర్త మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఆలయ అర్చకులు, వేదపండితులతో కలిసి యాగశాల ప్రవేశం చేసి శాస్త్రోక్తంగా ఉత్సవ ప్రారంభ పూజలను నిర్వహిస్తారు.

అంగరంగ వైభవంగా జరిగే ఈ మహోత్సవంలో ఈరోజు సాయంత్రం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లు భృంగివాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు భారీగా తరలివచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఉగాది మహోత్సవాలకు ముస్తాబైన శ్రీశైల మహాక్షేత్రం.. ఐదు రోజుల పాటు ఉత్సవాలు

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details