తెలంగాణ

telangana

గరుడ వాహనసేవకు పటిష్ఠ ఏర్పాట్లు..

By

Published : Sep 23, 2020, 6:58 PM IST

తిరుమల శ్రీవారి బ్రహోత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం స్వామివారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాసేపట్లో జరిగే స్వామివారి గరుడసేవలో జగన్ పాల్గొననున్నారు.

cm jagan
గరుడ వాహనసేవకు పటిష్ఠ ఏర్పాట్లు..పాల్గొననున్నఏపీ సీఎం

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా...ఇవాళ ఉదయం స్వామివారు మోహినీ అవతారంలో దర్శనమిచ్చారు. ఉత్సవాలలో ప్రధానమైన గరుడ వాహన సేవను కాసేపట్లో నిర్వహించనున్నారు.

సీఎం పర్యటన ఇలా..

వేడుకలో పాల్గొనేందుకు ఏపీ సీఎం జగన్... దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడినుంచి రోడ్డు మార్గాన తిరుమలకు వచ్చారు. పట్టువస్త్రాల సమర్పణ అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు, వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరిస్తారు. తర్వాత అతిథి గృహానికి చేరుకుని రాత్రి బస చేస్తారు.

గురువారం ఉదయం కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొంటారు. తర్వాత తిరుమలలో కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న వసతి గృహాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.

గరుడ వాహనసేవకు పటిష్ఠ ఏర్పాట్లు..పాల్గొననున్నఏపీ సీఎం

ఇవీచూడండి:పంచాయతీరాజ్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details