తెలంగాణ

telangana

Telangana News Today : టాప్​న్యూస్ @ 11AM

By

Published : Jul 12, 2022, 11:00 AM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today

  • రెడ్ అలర్ట్​.. ఆ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు

నాలుగైదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణను భారీ వానలు అతలాకుతలం చేస్తుండగా.. హైదరాబాద్ సహా దక్షిణ జిల్లాల్లో ముసురు కొనసాగుతోంది. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

  • రాష్ట్రంలో ప్రాజెక్టులకు జలసవ్వడి

గత నాలుగైదు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. ఓవైపు వరద ఉద్ధృతి.. మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలతో వచ్చే ప్రవాహంతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. నిరంతరాయంగా కురుస్తున్న వానతో రాష్ట్రంలోని చెరువులు, కుంటలు మత్తడి దూకుతున్నాయి.

  • వ్యాధులొస్తున్నాయ్.. జరపైలం

రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నివాసాల పరిసరాల్లో వాన, మురుగు నీటి నిల్వలు పెరుగుతున్నాయి. ఈగలు, దోమలు భారీగా వృద్ధి చెందుతున్నాయి. ఇప్పటికే వాతావరణ మార్పులతో జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఫ్లూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. వరద, మురుగు నీటి నిల్వల కారణంగా డయేరియా, జిగట విరేచనాలు, కామెర్లు, గ్యాస్ట్రోఎంటరైటిస్‌, మలేరియా, డెంగీ, గున్యా, మెదడువాపు తదితర వ్యాధుల ముప్పు పొంచి ఉంది.

  • దేశంలో భారీగా తగ్గిన కొవిడ్ కేసులు

భారత్​లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 13,615 మంది కొవిడ్ బారినపడ్డారు. 20 మంది మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు.

  • ఖాకీల్లో కామాంధులు

రక్షించాల్సిన వారే.. రాక్షసుల్లా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కాపాడతారని వెళ్తే కర్కశంగా కాటువేస్తున్నారు. హైదరాబాద్​లోని మారేడ్​పల్లి సీఐ, మల్కాజిగిరి సీసీఎస్ ఎస్సై సంఘటనలు మరవకముందే కుమురంభీం జిల్లాలో ఓ ఎస్సై యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటన వెలుగుచూసింది.

  • కూతురిపై నాలుగు నెలలుగా అత్యాచారం.. మైనర్​పై గ్యాంగ్​రేప్​

రాజస్థాన్​ కోటాలో దారుణం జరిగింది. కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ తండ్రి. బాధితురాలి స్నేహితురాలు ఈ విషయాన్ని బయట పెట్టడం వల్ల పోలీసులు కేసు నమోదు చేశారు. మరో ఘటనలో ఓ మైనర్​పై సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​ జశ్​పుర్​లో జరిగింది.

  • రైలు ఎక్కుతూ జారిపడ్డ మహిళ.. లక్కీగా..

కదులుతున్న రైలును ఎక్కడానికి ప్రయత్నించిన ఓ మహిళ జారి పడిపోయింది. వెంటనే రైలు లోపల ఉన్న రైల్వే కానిస్టేబుల్ ఆమెను కాపాడేందుకు ప్రయత్నించాడు. అంతలోనే అరుపులు విన్న గార్డు రైలును ఆపాడు. దీంతో మహిళ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడింది.

  • దిగొచ్చిన బంగారం, వెండి

దేశంలో బంగారం, వెండి ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి.. కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?

  • ఒప్పో, వన్​ప్లస్ ఫోన్లపై జర్మనీ నిషేధం

ఒప్పో, వన్​ప్లస్ ఫోన్లపై జర్మనీ నిషేధం విధించింది. నోకియా కంపెనీ పేటెంట్ హక్కులను ఉల్లంఘించిన నేపథ్యంలో జర్మనీ కోర్టు ఈ మేరకు తీర్పు చెప్పింది.

  • 'కార్తికేయ 2' వాయిదా

హీరో నిఖిల్​ నటించిన తాజా చిత్రం 'కార్తికేయ 2' విడుదల వాయిదా పడింది. ఆగస్టు మొదటి వారంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details