తెలంగాణ

telangana

Dalit Bandhu Vehicles Cost : 'దళితబంధు వాహన ధరల్లో వ్యత్యాసాలు ఉండొద్దు'

By

Published : Mar 17, 2022, 8:04 AM IST

Dalit Bandhu Vehicles Cost : దళితబంధు దరఖాస్తుల్లో ఎక్కువగా హార్వెస్టర్లు, జేసీబీ, ట్రాక్టర్లు, ఆటోలు, కార్లు వంటి సరుకు వాహనాల కోసమే ఉంటున్నాయని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ వాహనాల ధరలు ఒక్కో డీలర్ వద్ద ఒక్కో రకంగా ఉంటున్నాయని.. అన్ని చోట్లా ఒకే విధంగా ఉండాల్సిన అవసరముందని తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్, ఎండీ, జీఎం, వాహనాల కంపెనీల అధికారులతో సమీక్ష నిర్వహించి మరో 15 రోజుల్లో ఒకే ధర ఉండేలా నిర్ణయానికి రావాలని సూచించారు.

Dalit Bandhu Vehicles Cost
Dalit Bandhu Vehicles Cost

Dalit Bandhu Vehicles Cost : రాష్ట్రంలో దళితబంధు కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. ఈనెలాఖరు నాటికి హుజూరాబాద్‌ నియోజకవర్గంతో కలిపి 50వేల ఎస్సీ కుటుంబాలకు లబ్ధి జరుగుతుందని పేర్కొన్నారు. దళితబంధు దరఖాస్తుల్లో ఎక్కువగా వాహన దరఖాస్తులు ఉంటున్నాయని, వాహనధరలు ఒకేవిధంగా ఉండాల్సిన అవసరముందన్నారు. బుధవారమిక్కడ ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బండా శ్రీనివాస్‌, ఎండీ కరుణాకర్‌, జీఎం ఆనంద్‌కుమార్‌తో కలిసి వాహన కంపెనీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.

ఒకే ధర ఉండాలి..

Minister Koppula on Dalit Bandhu : దళిత బంధు లబ్ధిదారుల్లో 50 శాతం మంది హార్వెస్టర్లు, జేసీబీ, ట్రాక్టర్లు, ఆటోలు, కార్లు, సరకు రవాణా తదితర వాహనాలు కోరుకుంటున్నారని, ఈ ధరలు ఒక్కో డీలరు వద్ద ఒక్కో విధంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. వాహన ధరల్లో వ్యత్యాసాలతో ఇబ్బందులు వస్తున్నాయని, ఈ గందరగోళాన్ని నివారిస్తూ ఒకే ధరకే లబ్ధిదారులకు అందించేందుకు 15రోజుల్లో ఒక నిర్ణయానికి రావాలని సూచించారు.

రంజాన్‌కు రంగం సిద్ధం..

Koppula About Ramadan : రంజాన్‌ మాసం సందర్భంగా మసీదులు, ఈద్గాలకు మరమ్మతులు వెంటనే పూర్తిచేసి, రంగులు వేయాలని మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. పేదలకు పంపిణీ చేసే కానుకల్ని పండగకు ముందుగానే అందజేయాలని పేర్కొన్నారు. బుధవారమిక్కడ సంక్షేమభవన్‌లో రానున్న రంజాన్‌ మాసం సందర్భంగా మంత్రులు మహమూద్‌అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ప్రశాంతంగా పండగ..

Koppula Eshwar About Eid : రాష్ట్రంలో పండగలు, జాతరలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని, రంజాన్‌ మాసాన్ని, కేసీఆర్‌ ఇచ్చే విందు, పండగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. విద్యుత్తు, తాగునీటి కొరత లేకుండా, వీధిదీపాలన్నీ వెలిగేలా చూడాలని అధికారులను కోరారు. పండగ కోసం అవసరమైన పాలు, చక్కెర, బియ్యం, వంట గ్యాస్‌, ఇతర నిత్యావసరాలు అందుబాటులో పెట్టాలన్నారు. ప్రధాన మసీదులు, ఈద్గాల వద్ద మూత్రశాలలు నిర్మించాలని, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు. రాత్రివేళల్లో హోటళ్లు, దుకాణాలను మూసివేయాలంటూ ఒత్తిడి చేయవద్దని సూచించారు. ఈ సమావేశానికి నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి నదీం అహ్మద్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ తదితరులు హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details