తెలంగాణ

telangana

ముసాయిదాలోని అంశాలు మార్చండి : తెలంగాణ ఈఎన్​సీ మురళీధర్​

By

Published : Aug 31, 2022, 8:13 AM IST

Telangana ENC letter to KRMB : ముసాయిదా నివేదికలో ఉన్న అంశాలను మార్చాలని కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఈఎన్‌సీ సి.మురళీధర్​ లేఖ రాశారు. ఏపీ ప్రతిపాదనలను బోర్డు నమోదు చేస్తుండగా రాష్ట్రం చెబుతున్న అంశాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని అందులో పేర్కొన్నారు. 'తదుపరి సమావేశంలో అయినా మా అంశాలను తీసుకుంటారని భావిస్తున్నాం' అంటూ లేఖలో తెలిపారు.

Srisailam reservoir
శ్రీశైలం జలాశయం

Telangana ENC letter to KRMB : జలాశయాల నిర్వహణ కమిటీ (ఆర్‌ఎంసీ) రూపొందించిన ముసాయిదా నివేదికలోని (డ్రాఫ్ట్‌ రిపోర్ట్‌) అంశాలను మార్చాలని కృష్ణా బోర్డును తెలంగాణ కోరింది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదనలను చేర్చాలని సూచించింది. ఈ మేరకు బోర్డు ఛైర్మన్‌కు నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.మురళీధర్‌ మంగళవారం లేఖ రాశారు. తెలంగాణ చేస్తున్న సూచనలు, వినతులను మొదటి నుంచి బోర్డు పక్కన పెడుతూ వస్తోంది. ఏపీ ప్రతిపాదనలను బోర్డు నమోదు చేస్తుండగా రాష్ట్రం చెపుతున్న అంశాలను పరిగణనలోకి తీసుకోవడంలేదు. అయిదో ఆర్‌ఎంసీ సమావేశంలో తప్పనిసరిగా మా అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని ముసాయిదాలో పొందుపర్చాలి. లేని పక్షంలో ఆర్‌ఎంసీ సమావేశానికి హాజరవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన అందులో పేర్కొన్నారు. వచ్చే నెల 3న తిరువనంతపురంలో సదరన్‌ కౌన్సిల్‌ సమావేశాల్లో పాల్గొనాల్సి ఉన్నందున రెండో తేదీన నిర్వహించనున్న ఆర్‌ఎంసీని వాయిదా వేయాలని ఈఎన్‌సీ మరో లేఖలో విజ్ఞప్తి చేశారు.

ముసాయిదా అంశాలు- తెలంగాణ చేర్చాలంటున్న ప్రతిపాదనలు ఇలా :

జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల నిర్వహణపై

శ్రీశైలంలో విద్యుత్తు ఉత్పత్తి పంపకాలపై: శ్రీశైలం జలాశయం కింద విద్యుత్తు ఉత్పత్తి విధానం 76:24 (తెలంగాణ: ఏపీ) విధానంలో ఉండాలి. నదీ పరీవాహకంలోని అవసరాలకు (నాగార్జునసాగర్‌) అనుగుణంగా శ్రీశైలం నుంచి జల విద్యుత్తు ఉత్పత్తి చేసుకుని తెలంగాణ తన అవసరాలను తీర్చుకుంటుంది. రాష్ట్రంలో సాగు ఎక్కువ శాతం ఎత్తిపోతల పథకాలపై ఆధారపడి ఉంది. దీనివల్ల తక్కువ ధరకు, క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ విద్యుత్తు అందుబాటులో ఉన్న విద్యుత్తును వినియోగించుకుంటుంది.

వరదల సమయంలో రెండు రాష్ట్రాలు వాటి ఆధ్వర్యంలో కేంద్రాల నుంచి పూర్తి స్థాయిలో విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు.

సాగర్‌, పులిచింతలలో ఉత్పత్తిపై : నాగార్జునసాగర్‌ నుంచి కృష్ణా డెల్టా పథకాలకు నీటి విడుదల అవసరం లేదు.

సాగర్‌ రివర్సబుల్‌ పంపింగ్‌ వినియోగంపై:మోటార్లను వెనక్కు తిప్పి దిగువ నీటిని సాగర్‌లోకి ఎత్తిపోసుకునే విధానం ఏపీకి అనువుగా ఉండదు.

రూల్‌కర్వ్‌కు సంబంధించి సాగర్‌ నుంచి కృష్ణా డెల్టాకు విడుదలపై:

కేడబ్ల్యూడీటీ-1, జీడబ్ల్యూడీటీ ప్రకారం కృష్ణా డెల్టా అవసరాలకు సాగర్‌ నుంచి నీటి విడుదల అవసరం లేదు.

శ్రీశైలం నుంచి బేసిన్‌ బయటి అవసరాలకు ఏపీ 34 టీఎంసీల కన్నా ఎక్కువ నీరు విడుదల చేయడానికి వీల్లేదు.

బేసిన్‌ పరిధిలో తెలంగాణలో నిర్మాణంలో ఉన్న ఎస్సెల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు, డిండి తదితర ప్రాజెక్టులకు శ్రీశైలం నుంచి 582 టీఎంసీలు అవసరం ఉంది. 75 శాతం లభ్యతతో ప్రాజెక్టులో నీటి లభ్యత ఉంది. కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు యాభైశాతం చొప్పున తాత్కాలిక పంపిణీ చేయాలి.

మిగులు జలాలపై విధానం..ప్రాజెక్టులు నిండగా పొర్లిపోయే జలాల మళ్లింపును లెక్కించవద్దనే ఏపీ వాదనను తెలంగాణ అంగీకరించడం లేదు.

ABOUT THE AUTHOR

...view details