తెలంగాణ

telangana

గర్భిణీ మృతి ఘటనపై హైకోర్టుకు ప్రభుత్వ నివేదిక

By

Published : May 11, 2020, 3:40 PM IST

గద్వాలలో గర్భిణీ మృతి ఘటనపై ఉన్నత న్యాయస్థానానికి ప్రభుత్వం నివేదిక సమర్పించింది. తల్లీశిశువు మృతి ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని నివేదికలో వివరించింది.

telanagana-government-report-to-high-court-on-pregnancy-mortality-at-gadwala
గర్భిణీ మృతి ఘటనపై ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక

గద్వాలలో గర్భిణి మృతి ఘటనపై ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. న్యాయవాది కిశోర్​ కుమార్​ లేఖపై ప్రభుత్వం కౌంటరు దాఖలు చేసింది. తల్లీశిశువు మృతి ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

గద్వాలలో గర్భిణీ మృతి ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. న్యాయవాది కిశోర్ కుమార్ లేఖపై ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసింది. తల్లీశిశువు మృతి ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇలాటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. మెటర్నరీ సేవలకు అంతరాయం కలగవద్దని అన్ని ఆస్పత్రులను ఆదేశించామని తెలిపింది.

ప్రత్యేకంగా గర్భిణీల కోసం 300 అమ్మఒడి అంబులెన్సులు ఉన్నాయని వెల్లడించింది. లాక్‌డౌన్‌ కాలంలో 58,880 ప్రసవాలు జరిగాయని తెలిపింది. ప్రత్యేకంగా రాష్ట్ర గర్భిణీల పర్యవేక్షణ సెల్ ఏర్పాటు చేసినట్లు వివరించింది. ఎస్‌పీఎంసీ, 104, 102 కాల్ సెంటర్లు గర్భిణీల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నాయని తెలిపింది. ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు గర్భిణీలకు సమాచారం ఇస్తున్నారని... ఈనెల 30 వరకు డెలివరీ తేదీలున్న వారికి అంబులెన్స్‌ల ఫోన్ నంబర్లు ఇచ్చామని ప్రభుత్వం చెప్పింది.

ఇవీ చూడండి:ప్రధానికి ముఖ్యమంత్రి ఏం చెప్పబోతున్నారు..?

ABOUT THE AUTHOR

...view details