ETV Bharat / city

ప్రధానికి ముఖ్యమంత్రి ఏం చెప్పబోతున్నారు..?

author img

By

Published : May 11, 2020, 6:47 AM IST

దేశంలో కరోనా తీవ్రత దృష్ట్యా మరింత కాలం లాక్‌డౌన్‌ కొనసాగించాలనే అభిప్రాయంతో సీఎం కేసీఆర్​ ఉన్నట్లు తెలిసింది. నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నిర్వహించే దృశ్యమాధ్యమ సమీక్షలో సీఎం కేసీఆర్‌ పలు కీలక అంశాలను ప్రస్తావించనున్నట్లు సమాచారం.

cm kcr decided to give key decisions on lockdown
కరోనా కట్టడి, లాక్‌డౌన్‌ పొడిగింపుపై సూచనలు

లాక్‌డౌన్‌ పొడిగింపుతో పాటు, కరోనా కట్టడికి సంబంధించిన ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్​ పలు సూచనలు ఇవ్వనున్నట్లు తెలిసింది. ప్రధానితో చర్చించాల్సిన అంశాలపై సీఎం ఆదివారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ, పరీక్షల విధానం, లాక్‌డౌన్‌ అమలు గురించి చర్చించారు. దేశవ్యాప్తంగా ఈ నెల 17 వరకు లాక్‌డౌన్‌ ఉండగా... తెలంగాణ ప్రభుత్వం 29 వరకు దీనిని అమలు చేస్తోంది.

రాష్ట్రంలో పొడిగింపునకు నేపథ్యం గురించి సీఎం ప్రధానికి వివరించనున్నారు. కరోనాకు సంబంధించిన రాష్ట్రానికి కేంద్ర సాయం, గతంలో ప్రస్తావించిన ఎఫ్‌ఆర్‌బీఎంకు మరింత వెసులుబాట్లు వంటి అంశాలను కూడా మోదీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. విదేశాల నుంచి ప్రయాణికుల తరలింపు, ప్రవాసుల అంశాన్ని కూడా మాట్లాడే అవకాశం ఉంది.

ఇవీ చూడండి: ఆపరేషన్​ కరోనా: ముఖ్యమంత్రులతో నేడు ప్రధాని భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.