తెలంగాణ

telangana

ఇంటర్నేషనల్​ ప్రాజెక్టుకు సమంత ఎంపిక

By

Published : Nov 26, 2021, 3:47 PM IST

సమంత మరో క్రేజీ ప్రాజెక్టులో భాగమైంది. ఇంగ్లీష్ డైరెక్టర్​ ఫిలిప్ జాన్ కొత్త సినిమా కోసం సామ్​ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ట్వీట్ చేసిన సామ్.. సంతోషం వ్యక్తం చేసింది.

samantha
samantha

(samantha new movie) అంతకంతకూ తన ఇమేజ్​ పెంచుకుంటూ పోతున్న సమంత.. ఇప్పుడు అంతర్జాతీయంగానూ మెప్పించేందుకు సిద్ధమైంది. ఓ ఇంగ్లీష్ సినిమా​లో నటించేందుకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. ఈ సినిమాను ప్రముఖ రచయిత తిమేరి ఎన్.మురారి నవల 'ద అరెంజ్​మెంట్స్ ఆఫ్ లవ్​' ఆధారంగా తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన సామ్.. ట్విట్టర్​ వేదికగా దానిని వెల్లడించింది.


యూకేకు చెందిన స్టార్ దర్శకుడు ఫిలిప్ జాన్.. 'డౌన్​టౌన్ అబ్బే' లాంటి హిస్టరీ డ్రామాతో ప్రేక్షకుల్ని మెప్పించారు. నెట్​ఫ్లిక్స్​లో ఈ సిరీస్​ ఉంది. అయితే ఇప్పుడు ఆ డైరెక్టర్​ తీయబోయే కొత్త సినిమా​లో సామ్​కు ఛాన్స్ దక్కింది. ఇటీవల ఫిలిప్​ చెన్నై వచ్చినప్పుడు ఆయనను సమంత కలిసింది. అయితే ఈ సినిమాలో సమంత.. స్వలింగ సంపర్కురాలి పాత్రలో నటించనుందట.

"2009లో 'ఏ మాయ చేశావే' కోసం ఆడిషన్స్ ఇచ్చా. మళ్లీ 12 ఏళ్ల తర్వాత మరోసారి ఆడిషన్ ఇచ్చాను. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే అనిపించింది. అను పాత్ర కోసం నన్ను ఎంపిక చేసినందుకు థాంక్యూ ఫిలిప్ జాన్ సర్" అని సమంత ట్వీట్ చేసింది.

కథ ఇదేనా?

ఈ సినిమాలో 27 ఏళ్ల స్ట్రాంగ్​ మైండెడ్, ఫన్నీ మహిళగా సమంత నటించనుంది. సొంతంగా డికెట్టివ్​ ఏజెన్సీ నడిపే అను అనే అమ్మాయిగా కనిపిస్తుంది. స్వలింగ సంపర్కురాలైనప్పటికీ, తల్లిదండ్రుల మాటకు విలువిచ్చి పెళ్లికి సిద్ధమయ్యే పాత్రలో సామ్ కనిపించనుంది.

(samantha first movie)టాలీవుడ్​లో 'ఏ మాయ చేశావే' సినిమాతో హీరోయిన్​గా కెరీర్​ ప్రారంభించిన సమంత.. ఆ తర్వాత తమిళంలోనూ పలు చిత్రాలు చేసింది. స్టార్ హీరోయిన్​గా గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్​లో రాజీగా ప్రతినాయక లక్షణాలున్న పాత్రలో అభిమానుల్ని మెస్మరైజ్ చేసింది. దీంతో ఆమెకు పలు విభిన్న అవకాశాలు తలుపుతడుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడీ ఇంటర్నేషనల్​ ప్రాజెక్టు వచ్చింది.(samantha family man 2)

ఇదీ చూడండి:RRR Janani Song: భావోద్వేగానికి గురిచేస్తున్న 'జనని' సాంగ్

ABOUT THE AUTHOR

...view details